– రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం
– సొంత వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మరోసారి తన ఉదారతను, మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం కొండవీడులో జరుగుతున్న ఉత్సవాలకు హాజరైన అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా, ఫిరంగిపురం – కొండవీడు మధ్య రహదారిలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదానికి గురై కారును ఢీకొని తీవ్రంగా గాయపడిన విషయాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గమనించారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆలస్యం చేయకుండా వెంటనే క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. రక్తస్రావంతో బాధపడుతున్న వారిని తక్షణమే తన స్వంత వాహనంలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)కు తరలించారు.
ఆసుపత్రికి చేరుకున్న వెంటనే అక్కడ గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల చికిత్సలు అందేలా వ్యక్తిగతంగా పర్యవేక్షించారు.
ఎలాంటి పరిచయం లేని తమను ప్రమాద సమయంలో ఆదుకుని, ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి మానవత్వానికి క్షతగాత్రులు మరియు వారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా ప్రతినిధి అంటే కేవలం పాలన పరమైన బాధ్యతలు మాత్రమే కాక, ప్రజల కష్టాల్లో తోడుండడమనే విషయాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి మరోసారి ఆచరణలో చూపించారని స్థానికులు ప్రశంసిస్తున్నారు.