– హవాలా డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో దర్యాప్తు చేయాలి
– 24 గంటల్లో పార్టీ నుండి బహిష్కరించపోతే ముఖ్యమంత్రి కూడా బాద్యుడే
– బంగారు గనుల్లో కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టించింది ముఖ్యమంత్రి నా మీ ఎమ్మెల్యే నా..?
– మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
ఈడీ దర్యాప్తు చేస్తున్న ఇంటర్నేషనల్ డాన్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దావూద్ ఇబ్రహీం ని దాటి పోయాడు. ఇబ్రహీంపట్నంలో ఇందిరాగాంధీ పంచిన అసైన్డ్ భూముల మీద పడ్డాడు.రైతుల దగ్గర నయీమ్ తో బెదిరించి గుంజుకున్నడు.2015 నుండి అవాల కేసులు ఉన్నాయని ఈడీ అంది.కిషన్ రెడ్డి చేసిన మనీ లాండరింగ్ కి హవాలా డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో దర్యాప్తు చేయాలి. ఈయన కు ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బు వచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉన్న ఆస్తులు ..ఇప్పుడెంత? ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ప్రభుత్వ భూములను బినామీ గా ఆయన అనుచరుల దగ్గర పెట్టారు.ఇబ్రహీంపట్నం దగ్గర పొలాలను బెదిరించి అమ్ముకుంటున్నాడు.
ముఖ్యమంత్రి గారు మీ ఎమ్మెల్యే చేసిన తప్పులకు నీకు సంబంధం లేకపోతే ఎమ్మెల్యే ను పార్టీ నుండి పదవి నుండి బహిష్కరించాలి. 24 గంటల్లో పార్టీ నుండి బహిష్కరించపోతే ముఖ్యమంత్రి కూడా బాద్యుడే అవుతారు.ఫార్మా సీట్ లో 8632 ఎకరాల అసైన్డ్ భూమి లో 200 ఎకరాలు కొట్టేసాడు.సర్వే నెంబర్ 377 – 400 వరకు ఉన్న దానిలో 74 ఎకరాల భూమి ఉంది.అవి ప్రభుత్వ సంస్థలకు ఇవ్వగా ఇంకా 54 ఎకరాలు ఉండేది.రాత్రికి రాత్రే బినామీ ల పెరు మీద అమ్మాడు..500 కోట్లు వచ్చాయి.ఈ భూముల మీద ప్రభుత్వం సీబీఐ విచారణ జరపాలి.బంగారు గనుల్లో కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టించింది ముఖ్యమంత్రి నా మీ ఎమ్మెల్యేనా..? మొన్నటి ఎన్నికల్లో నేను గెలిచినా అని ప్రకటన వచ్చిన తర్వాత 300 ఓట్లతో కిషన్ రెడ్డి గెలిచారని చెప్పారు.ఈ అవినీతి సొమ్ముతోనే కొనేశారు.