హైదరాబాద్: హైదరాబాద్లోని టీవీ-5 కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును ఎమ్మెల్యే మరియు టిటిడి సభ్యుడు ఎంఎస్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడుకి పుష్పగుచ్చం అందజేసి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో టీటీడీ వ్యవస్థను బ్రష్టు పట్టించారని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందరికీ ఆదర్శంగా నిలిచే వ్యక్తి బిఆర్ నాయుడుకి టీటీడీ చైర్మన్ పదవి అప్పగించడం గర్వకారణమని అన్నారు. నూతన నాయకత్వంలో టీటీడీ అభివృద్ధి పథంలో నడవాలని, గతంలోని తప్పిదాలను సరిదిద్దుతూ భక్తుల మనోభావాలకు దెబ్బ తగలకుండా సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. మొత్తంగా, భక్తుల సేవలో టీటీడీ మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తూ ఎంఎస్ రాజు తన అభినందనలు తెలిపారు.