Suryaa.co.in

Andhra Pradesh

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు మండలం & పెనుగంచిప్రోలు గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్యగారి చొరవతో విజయవాడ స్రవంతి హాస్పటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని రకాల విభాగాలకి సంబంధించిన రోగులకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE