– రూ 12 వేల విలువైన మందులు అందజేత
– బాధితురాలికి అందించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
విజయవాడ: ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏడాదికాలంగా “సుజనా ఫౌండేషన్” ద్వారా పశ్చిమ నియోజకవర్గం లో ఉచితంగా వైద్య సేవలను అందిస్తూ ప్రజారోగ్య సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే అనేకమంది పేద రోగులకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించిన ఆయన బుధవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో ఓ బాధితురాలికి రూ 12 వేల విలువైన మందులను ఉచితంగా అందజేశారు.
52 వ డివిజన్ బ్రాహ్మణ వీధికి చెందిన బసవ దుర్గ ప్యాంక్రియాటైటిస్ అనే క్లోమగ్రంథి వ్యాధితో బాధపడుతుంది. పేదరికం కారణంగా మందులు కొనలేని పరిస్థితిలో ఇబ్బందులు పడటంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ సుజనా ఫౌండేషన్ ద్వారా రూ 12 వేల విలువ గల మందులను ఉచితంగా అందజేశారు.త్వరితగతిన స్పందించి మందులను అందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితురాలు బసవదుర్గ కృతజ్ఞతలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు ఈగల సాంబ, కొప్పుల గంగాధర్, బొడ్డు నాగలక్ష్మి,బాయన హేరంభ కుమార్ , కొంపెళ్ల శ్రీనివాసరావు, డాక్టర్
హనుమంతరావు, విశ్వేశ్వరరావు , సుజనా మిత్రా కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.