హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం( సెప్టెంబర్ 17) సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలను నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు కార్యకర్తలకు, నాయకులకు ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ విమోచన దినోత్సవాల కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు శాసనమండలి సభ్యులు సి అంజిరెడ్డి చైర్మన్ గా కమిటీని నియమించారు.
ఈ కమిటీలో సభ్యులుగా.. శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, శ్యాంసుందర్ గౌడ్, సురేందర్ రెడ్డి, పి విక్రం రెడ్డి, నందకం దివాకర్ తదితరులను నియమించారు.