Suryaa.co.in

Telangana

రాష్ట్రం ఏర్పడ ఎనిమిదేండ్లకు బీజేపీకి బుద్దొచ్చింది

-ఢిల్లీలో కేంద్రం బతుకమ్మ నిర్వహించడానికి కారణం కేసీఆర్
-తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాక ఢిల్లీలో ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదు
-తెలంగాణ భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తే, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ పతాక ఢిల్లీలో ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ కేంద్రం వైపు చూస్తున్నరు అనగానే బతుకమ్మ ఇండియా గేట్ లో ఇవ్వాల వెలుగుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎనిమిది ఏండ్లకు బీజేపీకి బుద్దొచ్చిందన్న ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీలో బతుకమ్మ ఆడటం వెనక కేసీఆర్ హస్తమే ఉందని సగర్వంగా తెలియజేస్తునన్నారు.

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అక్కా చెల్లెల్లు,కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాతే రాష్ట్రimage-3 సంస్కృతి, పద్దతి, యాస, భాషకు గౌరవం దక్కిందని, తెలంగాణ తల్లిని నిలబెట్టుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణలో విమోచన దినం నిర్వహించిన బీజేపీ, గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్టాచూ ఆఫ్ యూనిటీ అంటోందన్న ఎమ్మెల్సీ కవిత, విభజన కావాలో, యునిటీ కావాలో యువత ఆలోచించాలన్నారు.

సీఎం కేసీఆర్ త్యాగాల వల్ల, వారికి తోడుగా యావత్ తెలంగాణ ప్రజానీకం నిలబడటం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకుని, సగర్వంగా, గౌరవంగా రాష్ట్ర పండుగగా బతుకమ్మ జరుగుతున్నదన్నారు ఎమ్మెల్సీimage-4 కవిత. తెలంగాణ భవన్ ఒక చారిత్రాక ప్రదేశమన్న ఎమ్మెల్సీ కవిత, బతుకమ్మ జరుగుతున్నది, బోనాలు వెళుతున్నయంటే, ఇదంతా ప్రారంభమైంది తెలంగాణ భవన్ లోనే అని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం యొక్క, రూపురేఖలను, జీవనశైలిని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన భవనం తెలంగాణ భవన్ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించడం, కోటి మంది ఆడబిడ్డలకు చీరలను ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం తరపును గుర్తింపునిచ్చి, గౌరవమిచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎమ్మెల్సీ కవితimage-5 ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే సంతోషం, సంబరం తెలంగాణ భవన్ లోనే కాదు, యావత్ తెలంగాణ ప్రజానీకంలో, వారి ఇండ్లలో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

స్వరాష్ట్రం సాధించాక బీజేపీకి బుద్ధి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూస్తుంటే బీజేపీ నేతలు ఉలికి పడుతున్నారని కవిత విమర్శించారు. ఇక్కడ విమోచనం అంటున్న బీజేపీ నేతలు గుజరాత్లో మాత్రం ఐక్యత అంటున్నారని ఆ విషయం వాళ్లే తేల్చుకోవాలని అన్నారు.
తెలంగాణ భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ,జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE