భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘గౌరవనీయులైన శ్రీ వెంకయ్యనాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. కొన్ని దశాబ్దాలుగా ఆయన మన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. మన దేశ ప్రజలకు ఆయన ఒక స్ఫూర్తి. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమం పట్ల ఆయనకున్న అభిరుచి చాలా గొప్పది. ఎన్నో ఏళ్లుగా ఆయనకు దగ్గరగా పని చేసే అవకాశం నాకు దక్కింది. ఆయనలో ఉన్న ఎనర్జీని చూసి నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ఉప రాష్ట్రపతిగా (రాజ్యసభ ఛైర్మన్) పార్లమెంటు ప్రొసీడింగ్స్, చర్చల స్థాయులను ఆయన పెంచారు. ఆయన నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.
I have had the opportunity to work closely with @MVenkaiahNaidu Garu closely over the last several years. I have always admired his zeal and energy. As our VP, he has played a key role in raising the standards of Parliamentary proceedings and debates. Praying for his long life.
— Narendra Modi (@narendramodi) July 1, 2022
‘తెలుగు పలుకుకు, సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు రూపం వెంకయ్యనాయుడు గారు. ఆత్మీయులు వెంకయ్యనాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏ పదవిలో ఉన్నా ప్రజాసేవను, ప్రజాస్వామ్య విలువలను మరువని మీరు… ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులను సుఖసంతోషాలతో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
తెలుగు పలుకుకు, సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు రూపం వెంకయ్యనాయుడు గారు. ఆత్మీయులు @MVenkaiahNaidu గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏ పదవిలో ఉన్నా ప్రజాసేవను, ప్రజాస్వామ్య విలువలను మరువని మీరు… ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులను సుఖసంతోషాలతో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను pic.twitter.com/jsIunThaS7
— N Chandrababu Naidu (@ncbn) July 1, 2022
గౌరవనీయులైన ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. విలక్షణమైన వ్యక్తిత్వంతో కూడిన మానవతావాది వెంకయ్యనాయుడు గారు అని కొనియాడారు. రాజకీయ పదవులు చేపట్టినా, రాజ్యాంగ పదవులు చేపట్టినా ఆ పదవుల గౌరవాన్ని ఇనుమడింపజేశారని చెప్పారు. ఆయన ప్రసంగాలు వాడిగా, వేడిగా, చమత్కారాలతో ఆలోచింపజేసేవిగా ఉంటాయని అన్నారు. ఆయన చూపే నేర్పు, ఓర్పు రాబోయే తరం నాయకులకు ఆదర్శనీయమని చెప్పారు. అమ్మ భాష తెలుగుపై ఆయనకున్న అనురాగం తననెంతో ఆకట్టుకుంటుందని అన్నారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయనకు ఆ భగవంతుడు ఆనందకరమైన సంపూర్ణ ఆయుష్షును ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.