– కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనుల పరిశీలన సందర్భంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
కాజీపేట: నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం జరుగుతోంది. రైల్వే కోచ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అనేక సంవత్సరాలుగా ప్రజల కలగా ఉంది. ఆ కలను సాకారం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దే.
రూ. 500 కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటు జరుగుతోంది. 2026 నాటికి ఈ యూనిట్లో మాన్యుఫ్యాక్చరింగ్ ప్రారంభమవుతుంది. కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక మెగా ఫ్యాక్టరీగా రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ రైల్వే కోచ్లు, ఇంజిన్లతో పాటు మెట్రో రైళ్ల తయారీ, డిజైన్ పనులు కూడా జరుగుతాయి. బహుళ రకాల రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలు ఇక్కడ నిర్వహించబడుతాయి. ఈ ప్రాజెక్టు పురోగతిపై చాలా సంతోషంగా ఉన్నా.ఆయన వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తదితరులు ఉన్నారు