Suryaa.co.in

National

ముంబై వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించిన ప్రధాని మోదీ

గాంధీ నగర్ : రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా రాజధాని గాంధీ నగర్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రధాని ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించారు.ఈ రైలు గాంధీ నగర్ నుండిpm-modi-travels-onboard-van మహారాష్ట్ర రాజధాని ముంబైకి ప్రయాణించనుంది. గాంధీ నగర్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రధాని మొదట వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను పరిశీలించారు. రైల్వే సిబ్బందిని అడిగి రైలుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడమే కాదు స్వయంగా ఇంజన్ భాగాన్ని పరిశీలించారు. అనంతరం రైలును ప్రారంభించి అందులోనే కాలుపుర్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా రైల్లో మహిళలు, చిన్నారులతో పాటు సిబ్బందితో ముచ్చటించారు.

LEAVE A RESPONSE