– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: 25 ఏళ్లకే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన గిరిజన వీరుడు బిర్సాముండా గారి 150వ జయంతి సందర్భంగా, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జనజాతీయ గౌరవ దివస్ గా అన్ని రాష్ట్రాల్లో ఉత్సవాలు జరుపుతోంది. తెలంగాణలో కూడా ఈ వేడుకలు నిర్వహించబడుతున్నాయి.
ఈ సందర్భంలో నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుపెంటలోని వెనుకబడిన ప్రాంతాల ఆదివాసీ నివాసాలను బిజెపి బృందం, బిజెపి ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో పరిశీలించింది. ఇక్కడి ఆదివాసీలు ప్రభుత్వ పథకాలకు దూరంగా, సౌకర్యాల లేమితో, ఆరోగ్యం, విద్య, రవాణా సదుపాయాలు లేకుండా కష్టాలను ఎదుర్కొంటున్నారు. చెంచు పెంట ప్రాంతంలో భారత ప్రభుత్వం 176 ఇళ్లను పేదల కోసం నిర్మించింది, సోలార్ పవర్ కనెక్షన్లు కల్పించి ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని అందించింది.
బిజెపి బృందం ఆదివాసీల ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం పెంపు,.. వారికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తోంది. విద్య, వైద్య, రవాణా వంటి సౌకర్యాలు సమగ్రమైన విధంగా చేరేలా దృష్టి కేంద్రీకరించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆదివాసీల సంక్షేమానికి పెద్దపీట వేసింది. ద్రౌపది ముర్ము ని రాష్ట్రపతిగా చేసి, ఆదివాసీల గౌరవాన్ని పెంపొందించడం జరిగింది. బిర్సాముండా చేసిన పోరాటం, త్యాగాలు దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో గొప్ప పాత్ర పోషించాయి. స్వాతంత్ర్య పోరాటంలో అనేకమంది ఆదివాసీలు తమవంతు త్యాగాలు చేశారు. భారతదేశ సంస్కృతి, సంపదను కాపాడడంలో ఆదివాసీల పాత్ర చాలా ముఖ్యమైనది. చెంచుపెంటలో ఆదివాసీలకు కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వ సౌకర్యాలు అందించాలి. అలాగే, కేంద్రం నుండి అందుతున్న సహాయ కార్యక్రమాలు ఈ ప్రజలకే చేరేలా కృషి చేస్తాం.