– కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
బాపట్ల: అన్ని రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీగా ఎదగటానికి కారణం కార్యకర్తలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బాపట్లలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాధవ్ మాట్లాడారు. బాపట్ల అంటే మా పూర్వీకుల ఊరని భవన్నారాయణ స్వామి గుడి దగ్గర ఉన్న రామంజి కూటమిలో మా కుటుంబ సభ్యులు కూడా ఆ కూటమిలో సభ్యులని ఆయన అన్నారు. స్వతంత్ర పోరాటంలో బాపట్ల ప్రజలు కూడా ఎంతోమంది ఉన్నారని బాపట్లకి అంత గొప్ప పేరు ఉందని. ఆ రోజుల్లో గాంధీ కూడా బాపట్ల వచ్చారన్నారు. అలాంటి గొప్ప బాపట్లకు నేను రావట ఇంత ప్రజాదరణ పొందటం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనలాగా ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఈ రోజున ఒక గొప్ప శక్తిగా ఎదిగారని, మనందరం కూడా నరేంద్ర మోడీ వారసులమని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక పథకాల రూపంలో మీ ఇంటికి వచ్చారనని, రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలలో చాలావరకు కేంద్ర ప్రభుత్వం విధులు కూడా ఉంటాయని అన్నారు.
ఈ రోజున భారతదేశ వైపు ప్రతి ఒక్కరు చూస్తున్నారంటే అది నరేంద్ర మోడీ అని, అంత గొప్ప ఘనతని సాధించడానికి నరేంద్ర మోడీని నమ్మి ప్రజలు ఓటు వేయటం ఎంతో సంతోషమని, మన వేసిన ఓటిని వృధాగా పానీకొండ ఎప్పుడు దేశం గురించి ప్రజల గురించే ఆలోచిస్తూ, ముందుకు సాగుతున్నారని అన్నారు.