-అవినీతిలో రారాజు ప్రధాని నరేంద్ర మోదీ
-ఆయన అవినీతి గురించి మాట్లాడడం అర్దరహితం
-ప్రధాని మోడీ ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడిండు
-గ్రామ స్థాయిలో సర్పంచ్ కు ఉన్న అవగాహన ప్రధాని మోడీ కి లేక పోవడం విచారకరం
అరిగిపోయిన రికార్డు.. కాళేశ్వరం పై ఆరోపణలు
-మూడేళ్లుగా అవే ఆరోపణలు..అవినీతి ఉంటే నిరూపించూ
-కష్టకాలంలో ఎదురెక్కిన గోదావరి జలాలు కనిపిస్తలేవా..?
-కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పై దమ్ముంటే మోడీ శ్వేత పత్రం విడుదల చేయాలి
-దేశ రైతాంగం కోసం కేసీఆర్ “అబ్ కి బార్ కిసాన్ సర్కార్”… కార్పోరేట్ శక్తుల కోసం మోడీ అబ్ కి బార్ బీజేపీ సర్కార్
-తెలంగాణ కు రావాల్సినవి గుజరాత్ కు తరలించుకు పోతుంటే ఇక్కడి బీజేపీ దద్దమ్మలకు సోయి లేదు
-విభజన హామీలపై ప్రశ్నించే దైర్యం లేదు
-మోడీనీ గద్దె దింపుడు ఒక్క కేసిఆర్ తోనే సాధ్యం అవుతుంది
-కాంగ్రెస్,బీజేపీ పార్టీలు దేశానికి పట్టిన అరిష్టం
-తెలంగాణకు హాని తలపెట్టేవాడు ఎవ్వడైనా మాకు శత్రువే
– ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: ప్రధాని హోదాలో ఇవాళ వరంగల్ కు వచ్చిన మోడీ ప్రధాని అనే హోదాను మర్చిపోయి ఫక్తు రాజకీయ ఆరోపణలు చేశాడని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒక ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటే ఆ ప్రాంత డిమాండ్లు ఏంటి..వారికి ఏ హామీ ఇవ్వాలనే కనీస సోయి ప్రజాప్రతినిధులకు ఉంటుందని కానీ గ్రామ సర్పంచ్ కు ఉన్న కనీస అవగాహన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి లేక పోవడం విచారకరమని అన్నారు.
వరంగల్ ప్రాంత డిమాండ్ అయిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,బయ్యారం ఉక్కు కర్మాగారం,ట్రైబల్ యూనివర్సిటీ లాంటి డిమాండ్ల పై మాట్లాడకుండా కేసిఆర్ ను తిట్టడానికే అయన వచ్చినట్టు ఉన్నదని మండిపడ్డారు. 20వేల కోట్ల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కు తరలించుకు పోయి బోడి 520 కోట్ల వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్ధాపన చేశాడని దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీలు,నవోదయ పాఠశాలలు, ట్రిపుల్ ఐటిలు,మిషన్ భగీరథ కు నిధులు,కాళేశ్వరం,పాలమూరు ఎత్తిపోతల పథకం జాతీయ హోదా,మెట్రో రైల్ కోసం నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు.
రహదారుల కోసం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 1లక్ష21 వేల కోట్ల నిధులు మంజూరు చేసి కేవలం 19వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని..వారు కేటాయించిన నిధులు ఖర్చు చేయడానికి ఇంకో 50 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేసారు. భద్రకాలి అమ్మవారికి, సమ్మక్క సారలమ్మ వన దేవతలకు మొక్కిన మోడీ ఒక్కో గుడి అభివృద్ది కోసం 100 కోట్లు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతరను ఎందుకు జాతీయ పండుగ గా ప్రకటించలేదని మండిపడ్డారు. ఓట్ల రాజకీయం కోసం తప్పా మోడీకి దేవుని పై భక్తి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై పదే పదే అవినీతి అంటూ అరిగిపోయిన రికార్డు లెక్క మాట్లాడుతున్న మోడీ ఎందుకు నిరూపించలేకపోయారనీ నిలదీశారు.
గత 3యేండ్లు గా అవినీతి అంటూ మాట్లాతున్న మోడీ కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా ఎందుకు నిరూపించలేక పోతున్నారని ప్రశ్నించారు. నిండు కరువులో కూడా రివర్స్ పంపింగ్ ద్వారా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు పోచంపాడ్ కు ఎదురెక్కి వచ్చాయి. ఇదే కేసిఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఘనత అని స్పష్టం చేశారు.
అవినీతిలో రారాజు అయినా ప్రధాని నరేంద్ర మోదీ దేశ సంపదను అదానీ అంబానీలకు దోచిపెడుతూ..అవినీతి గురించి మాట్లాడడం అర్దరహితం, హాస్యాస్పదం అన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ ఇప్పటి వరకు ఎన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశారో దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. మోడీ ఇచ్చిన మరుక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కల్పనపై శ్వేత పత్రం విడుదల చేస్తామని సవాల్ విసిరారు.
దేశ రైతాంగం కోసం కేసీఆర్ “అబ్ కి బార్ కిసాన్ సర్కార్” అని కేసిఆర్ పని చేస్తుంటే..కార్పోరేట్ శక్తుల మేలు కోసం మోడీ అబ్ కి బార్ బీజేపీ సర్కార్ అని నినదిస్తున్నడు అని అన్నారు. తెలంగాణ కు రావాల్సినవి గుజరాత్ కు తరలించుకు పోతుంటే స్థానిక బీజేపీ దద్దమ్మలకు సోయి లేదని,విభజన హామీలపై తెలంగాణ ప్రజల ప్రోయోజనాల కోసం ప్రశ్నించే దైర్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోడీనీ గద్దె దింపుడు ఒక్క కేసిఆర్ తోనే సాధ్యం అవుతుందని మంత్రి వేముల తేల్చి చెప్పారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు దేశానికి పట్టిన అరిష్టమని,తెలంగాణకు హాని తలపెట్టేవాడు ఎవ్వడైనా మాకు శత్రువే అని మంత్రి పునరుద్ఘాటించారు.