Suryaa.co.in

Andhra Pradesh National

మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలు ప్రారంభించిన మోదీ

న్యూఢిల్లీ: మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలను ఢిల్లీలోని ఏఐఐఏ నుంచి ప్రధాని మంద్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. మంగళగిరి ఎయిమ్స్ లో ప్రయోగాత్మక డ్రోన్ పరీక్షచేపడుతున్నారు. ఎయిమ్స్ నుంచి నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు డ్రోన్ ను అధికారులు పంపారు. మహిళా రోగి నుంచి రక్త నమూనా సేకరించి తర్వాత ఆ డ్రోన్‌ ఎయిమ్స్ కు తిరిగొచ్చింది. ఎయిమ్స్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో నూతక్కి పీహెచ్‌సీ ఉంది. అయితే, తొమ్మిది నిమిషాల్లో తన పనిని కానిచ్చింది. రోగులకు మెరుగైన వైద్యసేవలు, రక్త సేకరణలో డ్రోన్ల ఉపయోగంపై ప్రయోగాలు చేస్తున్నారు.

LEAVE A RESPONSE