-బెంబేలెత్తిస్తున్న రైతు బంధు,రైతు భీమాలు
-కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉచిత విద్యుత్
-బిజెపి పాలిత రాష్ట్రాలలో తిరుగుబాటు భయం
-గుజరాత్ లో ఇప్పటికే నిలదిస్తున్న జనం
-అందుకే తెలంగాణా పై బిజెపి దాడి
-కమలనాథుల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాలి
-ప్రతి ఒక్కరూ సైనికుల్లా స్పందించాలి
-మంత్రి జగదీష్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రధాని మోదీ లో వణుకు పుట్టిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అందుకే తెలంగాణా ప్రభుత్వం పై కమలనాధులు కక్ష కట్టి మరీ దాడులకు పునుకుంటున్నరని ఆయన దుయ్యబట్టారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు లో బుధవారం జరిగిన టి ఆర్ యస్ పార్టీ శ్రేణులకు చెందిన కుటుంబ సభ్యులతో జరిగిన ఆత్మీయ సమ్మేలాననికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
శాసనమండలి సభ్యులు, టి ఆర్ యస్ పార్టీ జిల్లా ఎన్నికల ఇంచార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్ రావి, శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, కార్పొరేషన్ చైర్మన్ లు రామచంద్ర నాయక్, శ్రీధర్ రెడ్డి లతో పాటు నియోజకవర్గ టి ఆర్ యస్ పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు,రైతు భీమా పధకాలు బిజెపి పాలకులను బెంబేలెత్తిస్తున్నాయన్నారు.వ్యవసాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ తో పాటు తెలంగాణా లో నిరంతరం సరఫరా అవుతున్న 24 గంటల విద్యుత్ ప్రధాని మోదీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందన్నారు.బిజెపి పాలిత రాష్ట్రాలలో రైతు బంధు,రైతు బీ మా లతో పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్,24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా లపై బిజెపి పాలిత రాష్ట్రాలలో తిరుగుబాటు సంభవిస్తుందేమో నన్న భయం బిజెపి ని వెంటాడుతోందని ఆయన చెప్పారు.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో సాధించిన ప్రగతి,సంక్షేమ పథకాలపై అక్కడి ప్రజల నిలదీతలు మొదలయ్యాయన్నారు.అందుకే కమల నాధులు కక్ష కట్టి మరీ తెలంగాణా రాష్ట్రంపై దాడులకు పునుకుంటున్నారని ఆయన విమర్శించారు. అటువంటి వారి దాడులను గులాబీ శ్రేణులు సమర్థవంతంగా తిప్పి కొట్టాలని మంత్రి జగదీష్ రెడ్డి టి ఆర్ యస్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా స్పందిస్తే ఢిల్లీ భాష లది ఇక్కడ పని చేయదని, గుజరాత్ బాస్ లకు గులాంగిరి చేస్తున్న వారిని నిరోదించ గలుగుతామన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఫ్లోరోసిస్ కబలిస్తే ఆ ఫ్లోరోసిస్ ను మటు మాయం చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు.
ఇచ్చిన మాట ను నిలబెట్టుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెల్లిందన్నారు.స్వీయ నియంత్రణతో టైం బౌండ్ ప్రోగ్రాం మరీ పెట్టుకుని మిషన్ భగీరథ తో ఫ్లోరోసిస్ ను శాశ్వతంగా నిర్ములించడమే కాకుండా ఇంటింటికి సురక్షితమైన మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ గణతి కెక్కిందన్నారు. కళ్యాణలక్ష్మి పధకం ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వానికి అద్దం పడుతుండగా ఎన్నికల్లో చెప్పని పధకాలు, ఇవ్వని హామీలు కుడా అధికారంలోకి వచ్చాక అమలు పరిచిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు.