– అన్నాచెల్లెలి వివాదాల్లో ఇరుక్కుపోయా
– ఎన్సీఎల్ఎటీని ఆశ్రయించిన విజయమ్మ!
సరస్వతి పవర్ లిమిటెడ్ లో వాటాల బదలాయింపు, రిజిస్టర్లో వాటాదారుల పేర్ల మార్పుపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్ సీఎల్) హైదరాబాద్ బెంచ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడం షర్మిలకు, ఆయనకు. మధ్య ఉన్న రాజకీయ కలహాలను పరిష్కరించుకునే ప్రయత్నం తప్ప మరోటి కాదంటూ తల్లి వైఎస్ విజయమ్మ చెన్నైలోని నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు నివేదించారు.
ఇద్దరూ తన పిల్లలు కావడంతో వారి రాజకీయ గొడవల్లో చిక్కు కున్నానని పేర్కొన్నారు. కుటుంబ వివాదానికి కార్పొ రేట్ రంగు పులిమి వాటిని జగన్ తన రాజకీయ మైలేజీకి వినియోగించుకోవడం విచారకరమని వాపోయారు. గిఫ్ట్ డీడ్లు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒప్పంద మని, చట్టప్రకారం దానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
కంపెనీ చట్టంలోని సెక్షన్ 50 కింద జగన్ దాఖలు చేసిన పిటిషన్ వాస్తవంగా కార్పొరేట్ వివాదానికి సంబంధించినది కాదని, అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ వైరుధ్యాల పలితమేనని పేర్కొన్నారు. ప్రైవేటు, వ్యక్తి గత వివాదాలకు కార్పొరేట్ రంగు అద్ది తమ ప్రతిష్టను దెబ్బతీసి అక్రమంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్న మేనని పేర్కొన్నారు.
విజయమ్మ, జనార్దన్ రెడ్డిల పేర్లతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు తీర్మానాన్ని, దీని ప్రకారం రిజిస్టర్లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్, భారతీ రెడ్డి, క్లాసిక్ రియాల్టీలు హైదరాబాద్ ఎన్‌సీఎల్‌లో పిటిషన్ దాఖలు చేయగా.. వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్ తదితరుల పేర్లను పునరుద్ధరించాలంటూ జులై 29న తీర్పు వెలువరించిన విషయం విదితమే.
హైదరాబాద్ ఎన్సీఎల్ ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధ మని, దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ చెన్నై ఎన్సీఎల్ఎటీలో విజయమ్మ అప్పీలు దాఖలు చేశారు. ఆమె తరపున న్యాయవాది ఎం. మహర్షి విశ్వరాజ్ ఈ అప్పీలును దాఖలు చేశారు. సరస్వతి పవర్ దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి దీన్ని చెన్నై అప్పీలెట్ బెంచ్ త్వరలో విచారించనుంది. పిటీషన్లో విజయమ్మ పేర్కొన్న ప్రధాన అంశాలివి..
ప్రధాన వాటాదారునే
“1998లో విద్యుత్తు ఉత్పత్తి కొనుగోళ్లు, సరఫరా, నిల్వ, పంపిణీ తదతరాలతో సరస్వతి పవర్ ఏర్పాటైంది. ఈ సంస్థకు గుంటూరులో 903.28 ఎకరాల భూమి ఉంది. వాటాల బదలాయింపునకు ముందు జగన్‌కు 29.88, భారతీరెడ్డికి 16,30, క్లాసిక్ రియాల్టీకి 4.83 వాటాలు ఉండగా, నాకు 48.99 శాతం వాటాలున్నాయి. 2021 జులై 26న జగన్ 74.26 లక్షలు, భారతీరెడ్డి 40.50 లక్షల వాటాలను ప్రేమతో నా పేరిట గిఫ్ట్ డీడ్లు ఇచ్చారు. తర్వాత మాట మార్చి వాటి ఆధారంగా జరిగిన లావా దేవీలను కార్పొరేట్ వివాదం పేరుతో ప్రశ్నించడానికి వీల్లేదు.
క్లాసిక్ రియాల్టీతో రూ.3.07 కోట్లు చెల్లించి 11. 38 లక్షల వాటాలను కొనుగోలు చేశాను. వాటాలను కానుకగా ఇచ్చాక జగన్ 2021 ఆగస్టు 14న డైరెక్టర్ పద వికి రాజీనామా చేశారు. దీన్నిబట్టి సరస్వతి కంపెనీతో తన బంధం ముగిసినట్లుగా జగన్ భావించినట్లు తెలు స్తోంది. గిఫ్ట్ ఒప్పందాలను కానీ, వాటాల కొనుగోలు ఒప్పందాల చెల్లుబాటును కానీ ఏ సివిల్ కోర్టులోనూ సవాల్ చేయలేదు. అలాంటప్పుడు కార్పొరేట్ ముసు గులో వాటిని ట్రైబ్యునల్ లో సవాల్ చేయడానికి వీల్లేదు.
గిఫ్ట్ సమయంలో కలిసే ఉన్నా…
జగన్ తో కలిసి ఉన్నప్పుడే నాకు వాటాలను కానుకగా ఇచ్చారు. అప్పుడు ఒరిజినల్ వాటా సర్టిఫికెట్లు, వాటాల బదలాయింపు దరఖాస్తులు ఇవ్వగా వాటిని తనతో ఉంచుకున్నా, తరువాత కుటుంబంలో వివా దాలు, విభేదాలు తలెత్తి ఇది రాజకీయ విభజనకు దారితీసింది. ఈ వివాదాలతో జగన్ నన్ను, కుటుంబసభ్యు లను వదిలి వెళ్లిపోయారు. తనవద్దే ఉన్నాయంటున్న ఒరిజినల్ వాటా సర్టిఫికెట్లను జగన్ ఎన్‌సీఎల్‌లో పిటిషన్ వేసిన సమయంలో జత చేయలేదు.
కంపెనీ చట్ట నిబంధనల ఉల్లంఘన జరగలేదంటూ నేను కౌంటరు దాఖలు చేశాక ఒరిజినల్ సర్టిఫికెట్లను సమ ర్పించారు. పిటిషన్ వేసేటప్పుడే ఎందుకు సమర్పించ లేదన్న దానిపై స్పష్టత లేదు. 2024 ఆగస్టు 21న జగన్ ఇచ్చిన మూడు లీగల్ నోటీసుల్లో ఈడీ జప్తు ఉండగా వాటాల బదలాయింపు చేయరాదన్న ఒప్పందానికి విరుద్దమని మాత్రమే పేర్కొన్నారు. వాస్తవానికి అప్పటికి వాటాలను ఈడీ జప్తు చేయలేదు.
కంపెనీని కుటుంబ వివాదాల్లోకి లాగారు
చట్టబద్ధంగా ఏర్పడిన సరస్వతి కంపెనీని అనవస రంగా ఈ వివాదంలోకి లాగారు. అభ్యంతరకరమైన లావాదేవీలపై కంపెనీ చిత్తశుద్ధితోనే వ్యవహరించింది. నాతోపాటు దాగరి జనార్దన్‌రెడ్డి సమర్పించిన వాటా కొను గోలు పత్రాలు, బదలాయింపు పత్రాలు, స్వీయ నోటరైజ్డ్ అఫిడవిట్లు సమర్పించిన తరువాతే రిజిస్టర్లో ‘పేర్ల మార్పు జరిగింది. ఈ చర్యలను రద్దు చేయడం వల్ల కంపెనీ పాలన దెబ్బతిని నాకు నష్టం వాటిల్లుతుంది.
వాస్తవాలను పరిశీలించడంలో ట్రైబ్యునల్ విఫలం
సరస్వతి పవర్ బోర్డు సమావేశం 2024 జులై 2న వాటాల బదలాయింపును ఆమోదిస్తూ చేసిన తీర్మానం చట్టబద్ధంగానే జరిగింది. కార్పొరేట్ పేరుతో చూపుతున్న కుటుంబ వివాదమని అర్ధం చేసుకోవడంలో ట్రైబ్యునల్ విఫలమైంది. గిఫ్టేడ్లు, వాటా కొనుగోలు ఒప్పందాలను అమలు చేయడాన్ని వివాదం చేస్తున్నారన్న అంశాన్ని ట్రైబ్యునల్ విస్మరిం చింది. జగన్ తదితరులు కొనుగోలు ఒప్పందాలను తిరస్కరించలేదు.
గిఫ్ట్ డీడ్ల వాస్తవికతను ఏ సిటీ సివిల్ కోర్టులోనూ సవాల్ చేయలేదు. సభ్యుల పేర్లను రిజిస్టర్ చేయడానికి తిరస్కరించినప్పుడు, లేదంటే తప్పుగా నమోదు చేసినపుడు మాత్రమే ట్రైబ్యునల్ జోక్యం చేసుకోవచ్చు. అంతేగానీ స్వచ్ఛం దంగా ఇచ్చిన వాటాలను చట్టప్రకారం బదిలీ చేసి నపుడు అందులో జోక్యం చేసుకునే పరిధి ట్రైబ్యున లక్కు లేదు. కాంట్రాక్ట్ ఒప్పందాలను పట్టించుకో కుండా చట్టబద్ధంగా జరిగిన సభ్యుల రిజెస్టర్లో పేర్ల మార్పుపై జోక్యం చేసుకోవడం సరికాదు.
ఉత్తర్వులు నిలిపివేయకపోతే తీవ్ర నష్టం
ఇక్కడ అప్పీలు పెండింగ్‌లో ఉండగా ట్రైబ్యు నల్ ఉత్తర్వులను అమలు చేస్తే తీవ్ర నష్టం వాటి ల్లుతుంది. వివాదంలో సమతుల్యతను పరిగణన లోకి తీసుకోవాలి. ప్రస్తుతం మధ్యంతర ఉత్త ర్వులు ఇవ్వకపోతే సెటిల్ కాని 99.75 శాతం వాటా అస్తవ్యస్తమవుతుంది. కార్పొరేట్ కంపెనీ నిర్వహణ అస్థిరపడుతుంది. మూడో పార్టీ హక్కు లపై ప్రభావం పడుతుంది.
అంతేకాకుండా సభ్యుల రిజిస్టర్‌పై యథాతథ స్థితి కొనసాగించినట్లయితే జగన్, భారతీ రెడ్డి, క్లాసిక్ రియాల్టీలకు ఎలాంటి నష్టం వాటిల్లదు. ట్రైబ్యునల్ ఉత్తర్వు లతో జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీల పేర్లను తప్పుగా పునరుద్ధరిస్తే నాకు నష్టంతోపాటు మరిన్ని వివాదాలకు తెరతీసినట్లవుతుంది.
రాజకీయం కోసం తనను కూడా దుర్మార్గురాలుగా చూపడం కోసం కొడుకు చేసిన పని, అన్యాయం మీద అప్పీలుకు వెళ్లింది అమ్మ. ఇలాంటి కొడుకు ఉండడం విజయమ్మ దురదృష్టం అని ప్రజలు భావిస్తున్నారు.