గ్రీన్ ఎస్ఎం నుండి నేరుగా రేవంత్ రెడ్ఢి జేబుకే డబ్బులు

- కమీషన్ల కోసమే గ్రీన్ ఎస్ఎం కంపెనీకి అనుమతులు
- గ్రీన్ ఎస్ఎం ప్రతినిధులు ఢిల్లీ ఎఐసిసి లో మూటలు అప్పజెప్పి తెలంగాణలో అనుమతి తెచ్చుకున్నారు
- గ్రీన్ ఎస్ఎం కు లాభం చేయడం కోసమే,ప్రభుత్వం క్యాబ్ రేట్ కార్డు ప్రకటించడం లేదు
- ఆరు లక్షల మంది డ్రైవర్ల జీవితాలు ఆగమయ్యే ప్రమాదం
- క్యాబ్ డ్రైవర్లకు రేట్ కార్డు ప్రకటించాలి
- జియో నెట్ వర్క్ లాగే గ్రీన్ ఎస్ఎం ఆఫర్లు
- రవాణాశాఖ మంత్రి ఆటో డ్రైవర్లకు రేట్ల కార్డు ఇచ్చారు
- గ్రీన్ ఎస్ఎం కంపెనీ రూ. 8 కి.మీ కు ఎలా నిర్ణయించారు?
- ఆ కంపెనీకి అగ్రిగేట్ లైసెన్స్ ఎలా ఇచ్చారు?
- ప్రభుత్వం దానికి సంబంధించిన నోట్ ఫైల్ బయటపెట్టాలి
- వాహనం లోపల కెమెరాలు ప్రయాణికుల ప్రైవసీ దెబ్బతీయడమే
- కానీ క్యాష్ డ్రైవర్లకు రేట్ కార్డు లేదు
- ఆటో క్యాబ్ డ్రైవర్లను దోచుకొని, ఆ సొమ్మును వియత్నాం పంపే కుట్ర
- బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల 6 లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆకలి చావు మధ్య బతుకుతున్నారు. మహిళలకు ఉచిత బస్సుకు మేం వ్యతిరేకం కాదు. విదేశాల నుండి పెట్టుబడులు రావడానికి వ్యతిరేకం కాదు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటి మంత్రి కేటిఆర్ ఎన్నో విదేశీ పెట్టుబడులు తెచ్చారు. కానీ దాని వల్ల ఎవరికీ నష్టం చేకూర్చలేదు.
ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధనార్జన కోసం, జేబులు నింపుకోవడం కోసం గ్రీన్ ఎస్ఎం అనే కంపెనీకి అనుమతులు ఇచ్చారు. దీనివల్ల 6 లక్షల మంది ఆటో మరియు క్యాబ్ డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. గ్రీన్ ఎస్ఎం కంపెనీకి చెందిన క్యాబ్ లు తెలంగాణలో హైదరాబాద్ లో తిరగడం ప్రారంభించారు. ఇది వియత్నాం కు చెందిన కంపెనీ.
కొత్త కంపెనీని ఆహ్వానించి ముందు, దాని వల్ల ఏమైనా ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందా అని ఆలోచించి, చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎలాంటి అవగాహన లేకుండా, ఎలాంటి చర్చలు జరగకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. ఆరు లక్షల మంది డ్రైవర్లు లోన్స్ ,బంగారం పెట్టి వాహనాలు తీసుకున్నారు. నెల నెలా ఈఎంఐ లు,వడ్డీలు చెల్లిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ఇప్పటికే డ్రైవర్లకు ర్యాపిడో, ఓలా,ఉబర్ వంటి యాప్ ల ద్వారా ఆర్డర్ రావడం లేదని ఆందోళనలో ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డికి ఉపాధి కల్పించే ఆలోచన లేదు, జాబ్ క్యాలెండర్ లేదు.ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. టామ్ కామ్ పేరిట నిరుద్యోగులను జర్మనీ వంటి దేశాలకు పంపిస్తామని 4 లక్షలు వసూలు చేసి మోసం చేశారు. గతంలో రవాణాశాఖ మంత్రి ఆటో డ్రైవర్లకు రేట్ల కార్డు ఇచ్చారు. కానీ క్యాష్ డ్రైవర్లకు రేట్ కార్డు లేదు.
గ్రీన్ ఎస్ఎం కిలోమీటర్ కు కేవలం 8 మాత్రమే వసూలు చేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు జీవో 46 ఆధారంగా మొదటి 1.4 కి.మీ 30.. అదనంగా ప్రతి కి.మీ 14 వెయిటింగ్ కి 75 పైసలు వసూలు చేసేలా వెసులుబాటు ఉంది. కానీ క్యాబ్ డ్రైవర్లకు ఎలాంటి అవకాశం లేదు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ప్రభావం వల్ల ఆటో డ్రైవర్లు 300 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.
గత ప్రభుత్వం డ్రైవర్లకు 5 లక్షల భీమా ఇస్తే, కాంగ్రెస్ వచ్చాక ఆటో డ్రైవర్లకు 10 లక్షలు భీమా ఇస్తామని చెప్పి, ఉన్నది కూడా రాకుండా చేశారు. ఆటో డ్రైవర్లకు నెలకు 12 వేలు ఇస్తామని ప్రకటించి ఇవ్వడం లేదు. ఇవన్నీ సమస్యలు ఉండగానే గ్రీన్ ఎస్ఎం ప్రతినిధులు ఢిల్లీ ఎఐసిసి లో మూటలు అప్పజెప్పి, తెలంగాణలో అనుమతి తెచ్చుకున్నారు. గ్రీన్ ఎస్ఎం కు లాభం చేయడం కోసమే, ప్రభుత్వం క్యాబ్ రేట్ కార్డు ప్రకటించడం లేదు.
కేవలం 6 గం.లు మాత్రమే రోడ్ల మీదనే పడుకొని కష్టపడి జీవితాలు కుటుంబాలను నడుపుతున్న క్యాబ్ డ్రైవర్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గ్రీన్ ఎస్ఎం కంపెనీ రూ. 8 కి.మీ కు ఎలా నిర్ణయించారు? ఆ కంపెనీకి అగ్రిగేట్ లైసెన్స్ ఎలా ఇచ్చారు? ప్రభుత్వం దానికి సంబంధించిన నోట్ ఫైల్ బయటపెట్టాలి. గ్రీన్ ఎస్ఎం నినాదం డ్రైవర్ కాదు. పార్ట్ నర్ కండి. ఇది ఒక కుట్ర.
డ్రైవర్ అయితే ఇపిఎఫ్ ఇవ్వాలి. ఇఎస్ఐ ఇవ్వాలి. ఇన్సురెన్స్ ఇవ్వాలి. అందుకే డ్రైవర్ కాదు పార్ట్ నర్ కావాలని అంటున్నారు. ప్రతి వారం 8 వేలు ఇస్తామంటున్నారు. దానికోసం క్యాబ్ 500 కి.మీ నడిపించాలంటున్నారు. వాహనం మీద గీతలు పడినా అపరాధ రుసం వేస్తామంటున్నారు. వాహనం లోపల కెమెరాలు పెట్టారు. ఇది ప్రయాణికుల ప్రైవసీ దెబ్బతీయడమే. గ్రీన్ ఎస్ఎం కంపెనీ వారు ప్రయాణీకులు ప్రయాణించడానికి ఆఫర్లు ఇస్తున్నారు. కానీ ఇవన్నీ మోసాలు.
రేవంత్ రెడ్డి గారు.. మీకు మీ మంత్రులకు ఎన్ని డబ్బులు కావాలో చెప్పండి. వచ్చే ఏడాది ఎల్ కాంగో అని బడ్జెట్ పెట్టండి. మీ స్వార్థ కోసం ఇతరుల జీవితాలు ఆగం చేయకండి. తప్పనిసరి అయితే క్యాబ్ లు కూడా ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి, గ్రీన్ ఎస్ఎం క్యాబ్ ఇప్పించండి అని డ్రైవర్లు అంటున్నారు. చేయండి. ఆటో క్యాబ్ డ్రైవర్లను దోచుకొని, ఆ సొమ్మును వియత్నాం కు పంపే కుట్ర జరుగుతుంది.
వియత్నాం లో విఎఫ్ 6 వచ్చాక, గోజిక్ అనే కంపెనీ ఖతమైంది. లోకల్ లో ఉన్న కంపెనీలను వదిలేసి వియత్నాం కు ఎలా ఇచ్చారు? వియత్నాం లో మన ఓలా, ఉబర్, రాపిడి నడుపుతమంటే ఒప్పుకుంటరా వాళ్లు? 2016 లో జియో కంపెనీ ఫ్రీ డాటా, ఫ్రీ కాల్స్ అని ఆఫర్లు పెట్టడంతో..
ఎయిర్ సెల్,టాటా డొకోమో, ఐడియా, ఓడాఫోన్ కలిసిపోయాయి. కస్టమర్స్ పెరిగిన తర్వాత, విపరీతంగా రేట్లు పెంచింది.
అలాగే గ్రీన్ ఎస్ఎం కూడా ముందుకొస్తుంది. ఇపుడు తక్కువ ధరలతో ఆకర్షిస్తుంది. తర్వాత అధిక ధరలు పెంచి పీడిస్తారు. ప్రజలందరూ గ్రీన్ ఎస్ఎం కార్లు కొనాలని, అడ్వర్టైజ్ మెంట్ కోసమే ఇదంతా చేస్తుంది. తమిళనాడు ప్రభుత్వం మొదటి కి.మీ 50, అదనపు కి.లో 25 వెయిటింగ్ 1 రూ అమలు చేస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేసి ఆర్ కాలంలో 5 లక్షల భీమా ఉండేది, క్యాబ్ లు కొనుక్కునే వారికి సబ్సిడీ ఇచ్చేవారు.
గ్రీన్ ఎస్ఎం నుండి నేరుగా రేవంత్ రెడ్ఢి జేబుకే డబ్బులు. వెంటనే క్యాబ్ డ్రైవర్ రేట్ కార్డు ప్రకటించాలి.కాంగ్రెస్ ప్రతి స్కీం వెనుక ఒక స్కాం ఉంది. కేంద్ర ప్రభుత్వ విధివిధానాల ప్రకారం ఏ ఆపరేటర్ అయినా బేస్ ఫేర్ కు 50 శాతం కంటే తక్కువ ఉండొద్దు. కానీ గ్రీన్ ఎస్ఎం కిలో మీటర్ కు 8 రూ. ఎలా అమలు చేస్తున్నారు ? ఆటో క్యాబ్ జెఎసి కి మద్దతుగా బిఆర్ఎస్. పేద వర్గాల నుండి వచ్చిన పొన్నం ముఖ్యమంత్రితో మాట్లాడి ఆదుకోవాలి.
ఎఐటియుసి,బి ఆర్ టియు, సి ఐటియు, టియుసి ఐ, టి ఎన్ టియుసి, అమ్మ క్యాబ్, ఏక్తా అసోసియేషన్ వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
