Suryaa.co.in

Andhra Pradesh

50 రోజుల్లో 10వేలకు కు పైగా గ్రీవెన్స్ కు అర్జీలు

• పారదర్శకంగా అర్జీల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక
• సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అర్జీదారులందరికి న్యాయం జరిగేలా చర్యలు
• మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

మంగళగిరి: వస్తున్న అర్జీదారులకు ఇస్తున్న వినతులకు న్యాయం జరిగేలా… ప్రత్యేక చర్యలు చేపడతున్నామని.. దాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి.. ప్రతి అర్జీని పారదర్శకంగా పరిశీలించి.. గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.

ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందన్నారు.. నాయకులు అధికారులు సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇప్పటికే 10 వేలకు పైగా అర్జీలు అందాయని.. ప్రతి అర్జీని సంబంధింత శాఖలకు, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు పంపి… వాటిని పరిష్కరించి. ఆ పరిష్కార ఫలితాన్ని మళ్లీ అర్జీదారునికి తెలియ జేసేలా కృషి చేస్తూ.. ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజల మన్ననలు చూరగొనేలా నడుచుకొంటామని వారు పేర్కొన్నారు.

మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేడు పాల్గొన్ని ఇరువురు వినతులు స్వీకరించారు. విద్యుత్ సమస్యలతో పాటు వివిధ సమస్యలపై పెద్దఎత్తున అర్జీదారులు పోటెత్తి తమ అర్జీలను అందించారు. నామినేటెడ్ పదవులకోసం రాష్ట్ర అధ్యక్షులకు వినతులు ఇచ్చారు.

• తన బిడ్డ చుండూరు కృష్ణతేజకు 90% అంగవైక్యలం ఉన్నా గత ప్రభుత్వంలో పింఛన్ ఇవ్వలేదని… కనీసం కూర్చోలేని స్థితిలో ఉన్న తన బిడ్డయందు దయ ఉంచి వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని మంత్రి గొట్టిపాటి ముందు కృష్ణతేజ తండ్రి చుండూరి బాబు వాపోయారు. వెంటనే స్పందించిన మంత్రి పింఛన్ మంజూరుకు చర్యలు తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

• మేము టీడీపీకి చెందిన వాళ్లమని మా కొడుకు పూర్తి 100% అంగవైక్యలం ఉన్నా దివ్యాంగ పింఛన్ ఇవ్వడంలేదని.. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సంతకం పెట్టించుకు రావాలని… అధికారులు చెప్పగా.. ఆయన వద్దకు వెళితే సంతకం పెట్టలేదని.. పల్నాడు జిల్లా కారంపూడి గ్రామం వాలే వీర నాగేశ్వరరావు వాపోయారు.. తన కొడుకు ఆరోగ్యం సక్రమంగా లేదని… తన కొడుకు కి పూర్తి అంగవైక్యలం పింఛన్ అందించాలని విజ్ఞప్తి చేశారు.

• తన బిడ్డ సునీల్ కుమార్ ను నవజీవన సంస్థకు చెందిన వ్యక్తి తీసుకెళ్లి ఎన్నారై ఆసుత్రిలో చేర్పించి ప్రాణాలు తీశారని.. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఒక్కగాని ఒక్క బిడ్డను చంపేసి అతని అవయువాలు తీసుకున్నారని… వెంటనే పోస్ట్ మార్టం చేసి నిజాలను బయట పెట్టాలని.. విజయవాడకు చెందిన తల్లి నిర్మల కుమారి నేతలముందు వాపోయింది. ఆమెకు ప్రభుత్వ పరంగా సాయం చేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు.

• గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని అసలు పట్టించుకోలేదని… అగ్రిగోల్డ్ బాధితులు సమస్యలను పరిష్కరిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించినందున తమ పై దయ ఉంచి సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించాలని అగ్నిగోల్డ్ బాధితులు వాపోతూ గ్రీవెన్స్ లో వినతి అందించారు.
• నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు కు చెందిన ఆకుల నారాయణ విజ్ఞప్తి చేస్తూ… వైసీపీ నేతల దౌర్జన్యాలతో తాను ధాన్యం అమ్ముకోలేక పోతున్నానని.. వడ్డీలకు తెచ్చుకుని వడ్ల వ్యాపారం చేస్తున్న తాను వైసీనేతల దుర్మార్గం వలన తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని… దయచేసి ధాన్యం అమ్ముకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

• బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం సూదివారిపాలెం మరియు అంబటి వారిపాలెం గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తూ… ఈ రెండు గ్రామాలకు ఒకటే మంచినీటి చెరువు ఉందని… దాంట్లో చేపలు పెంచుతూ రసాయనాలు, జంతుకళేబరాలను వేస్తున్నారని.. తాగునీటిని కలుషితం చేస్తున్నారని.. నీటి కలుషితంతో చర్మవ్యాధులు, అతిసార, డెంగ్యూ లాంటి వ్యాధుల బారిన పడుతున్నామని ఆ రెండు గ్రామాల ప్రజలు వాపోయారు. దాన్ని అరికట్టి ప్రజలకు పరిశుభ్రమైన నీటిని అందించాలని కోరారు. వాటర్ ట్యాంక్ ఫిల్టర్ బావి పునర్నిర్మాణం చేయాలని కోరారు. గ్రామంలో హిందూ స్మశాన వాటిక పల్లంలో ఉందని… దాంతో దహన సంస్కారాలకు ఇబ్బందిగా ఉందని… నీటి వసతి కూడా లేదని.. దయ ఉంచి ఈ సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తిచేశారు.

• నరసాపురం మండలం L.B చెర్ల గ్రామానికి చెందిన పసుపులేటి కనకదుర్గ అనే మహిళ ఫిర్యాదు చేస్తూ… తోట లక్ష్మణ కుమార్. అనే వ్యక్తి వలన తన భర్తకు తాను విడాకులు ఇవ్వవలసి వచ్చిందని… తరువాత తోట లక్ష్మణ్ కుమార్ తనను పెళ్లి చేసుకున్నాడని కొంత కాలాని నువ్వు ఎవరో నాకు తెలియదని తన దగ్గర నుండి వెళ్లి పోవాలని ఇబ్బంది పెడుతున్నాడని.. కనక దుర్గ వాపోయింది. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. తనకు న్యాయం చేయాలని… లేదంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.

• గతంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా హనుమంతాపురం గ్రామం బూత్ నెంబర్ 195 లో వైసీపీ నాయకులు దొంగఓట్లు వేస్తుంటే… అడ్డుకున్నందుకు నాడు ఎస్సై చంద్రమౌళి తనను తీవ్రంగా దుర్భాషలాడి తన వయసును కూడా పట్టించుకోకుండా అవమానించాడని… టీడీపీ నాయకులు జె. వి రమణయ్య నాయుడు నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. నాడు దొంగ ఓట్లకు సహకరించిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని కోరారు.

• ఏఎన్ ఎమ్ నుండి జీఎన్ ఎమ్ శిక్షణ కోసం వచ్చిన తాము రెండు సంవత్సరాలపైనా శిక్షణ ఇచ్చి పరిక్ష నిర్వహించారని… అందులో అందులో 84 మందిని అన్ క్వాలిఫై చేశారని… వారికి మళ్లీ పరీక్ష నిర్వహించి తగు న్యాయం చేయాలని రాజమండ్రి నుండి వచ్చిన ఏఎన్ఎమ్ లు విజ్ఞప్తి చేశారు. అలాగే ANM2లు తమకు పనిగికి తగిన వేతం ఇవ్వడం లేదని…తమ యందు దయ ఉంచి పనికి తగిన వేతం వచ్చేలా కృషి చేయాలని గ్రీవెన్స్ లో వినతి పత్రాన్ని అందించారు.

• తాను గుంటూరు జిల్లాలోని దాసరిపాలెం ఐటీసీ కంపెనీలో పనిచేస్తుండగా తన చేతి వేళ్లు తెగిపోయాయని.. చేతివేళ్లు నష్టపోయిన తనకు కంపెనీ నష్టపరిహారం చెల్లించేందుకు నిరాకరిస్తొందని.. తనకు జాబ్ ఇప్పించి ఆదుకోవాలని ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టి చెరుకూరు మండలం పల్లపాడు గ్రామానికి చెందిన సాయి మహేష్ విజ్ఞప్తి చేశాడు.

• ఏపీ ట్రాన్స్ కో నెల్లూరు సర్కిల్, 220kv ఆత్మకూరు, 220kv రాచర్లపాడు, 132kv వింజమూరు సబ్ స్టేషన్ ల యందు తొలగించిన కార్మికులను తిరిగిని విదుల్లోకి చేర్కోవాలని వారు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.

• మాకు జీతాలు ఇప్పించి న్యాయం చేయాలని ఏపీసీఎన్ఎఫ్( ప్రకృతి వ్యవసాయం) సిబ్బంది వాపోరారు. 18 నెలలుగా తమకు జీతాలు రాలేదని నేతలకు తెలిపారు. బాపట్ల జిల్లా DPM జీతాలు అడిగే దుర్భాషలాడుతుందని… తమకు జీతాలు ఇప్పించి న్యాయం చేయాలని వారు కోరారు.

• కడప జిల్లా వేముల మండలం వేముల గ్రామానికి చెందిన బేరి దేవభూషణం విజ్ఞప్తి చేస్తూ.. తాను 2017వ సంవత్సరంలో చిన్నతోట కృపారావు నుండి ఇళ్లు కొన్నామని… దానికి సంబంధించి పూర్తి డబ్బులు చెల్లించినా కృపారావు, పార్థసారథిరెడ్డిలు కుట్ర పూరితంగా ఇంటిని రిజిష్ట్రేషన్ చేయడంలేదని… వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.

• పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కు చెందిన మహిళన రూ. 20,000లకు చెందిన తన ఫోన్ ను రూ. 2000లకు తాకట్టు పెట్టానని.. ఆ డబ్బులు తిరిగి చెల్లించినా తన ఫోన్ ఇవ్వడంలేదని.. తన ఫోన్ ఇప్పించాలని గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.

• పార్టీకోసం పనిచేసిన నేతలు నామినేటెడ్ పదవులను ఆశిస్తూ… నేడు పెద్ద ఎత్తున్న అర్జీలు తీసుకు వచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లాశ్రీనివాసరావుకు అందజేశారు. తామ పార్టీకోసం చేసిన పనిని గుర్తించి తగిన నామినేటెడ్ పదవిని ఇచ్చి న్యాయం చేయాలని కోరారు.

వైసీపీ భూ కబ్జాల సమస్యలు, భూ ఆక్రమణ సమస్యలు… అర్హత ఉన్నా గత ప్రభుత్వంలో పింఛన్ రాని వారు… విద్యుత్ లైన్ సమస్యలు. విద్యుత్ అధికారల ఆగడాలు, కళాకారుల సమస్యలు ఇసుక పాలసీ, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ సమస్యలు, ట్రాన్సఫర్ ల కోసం ఉద్యోగులు ఇలా వందల మంది అర్జీ దారులు తమ వినతులు నేతలకు ఇచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

LEAVE A RESPONSE