* మహిళలు, వారి కుటుంబాలు అధైర్యపడవద్దు..
* అటువంటి సందేశాలు వొస్తే సూటి పోటి మాటలు అనకుండా సమాజం మద్దతుగా నిలవాలి
* ప్రభుత్వం కూడా ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరించే దిశగా అడుగులు వేస్తోంది.
* ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు, డిజిపి స్థాయి లో చేర్చించడం జరుగుతోంది..
– మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ
లోన్ యాప్ ల ద్వారా తక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చి, లక్షలు దోచుకుని వేధింపుల కు గురిచేస్తున్నారు, అటువంటి వాటిపై కఠినంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.
ఆదివారం ఉదయం సుబ్రహ్మణ్య మైదానంలో లోన్ యాప్ లపై రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి, తదితరులతో కలిసి వాసిరెడ్డి పద్మ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, లోన్ యాప్ నిర్వాహకులు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించినా, మహిళలే లక్ష్యంగా వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి బంధువులకు స్నేహితులకు, చట్టాలకు, వారితో కాంటాక్ట్ లో ఉన్న వారికి అసభ్యకర సందేశాలు పంపుతూ వేధిస్తున్నారని, ఇటువంటి వారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
మహిళలే కేంద్రం గా వేదింపులు ఉంటున్నాయని, అవమానానికి గురై ఆత్మహత్యకు ప్రేరేరింప చేస్తున్నాయన్నరు. భాదితులు ఆత్మహత్య చేసుకున్నా ఇంకా వేదింపులు కొనసాగడం జరుగుతోందన్నారు. చైనా వంటి దేశాల నుంచి ఈ యాప్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెర ముందు కనిపించే వ్యక్తులు వేరు, తెర వెనుక ఉండి నడిపించే వారు వేరు అన్నారు. కంటికి కనిపించని శత్రువులపై పోరాడవలసి వస్తోందని, వీటిని సమర్థవంతంగా ఎదుర్కునే దిశలో ముఖ్యమంత్రి, డిజిపి స్థాయి లో ఉన్నతస్థాయి లో మేధోమథనం చేస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ ల నిరోధించే క్రమంలో ఎదుర్కొన్న సాంకేతిక పరమైన అంశాలు కూడా పరిగణన లోకి తీసుకుని లోన్ యాప్ ల నిరోధం దిశగా ఆలోచన చెయ్యడం పై చర్చిస్తున్నట్లు తెలిపారు.
తప్పకుండా వీటికి పరిష్కారం కనుగొనడం జరుగుతుందని, మహిళలకు సంబంధించిన వేధింపులు వలన ఆత్మ హత్య చేసుకుంటున్నారు. దయచేసి ఆత్మ హత్యలకు పాల్పడవద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ అన్నారు. వారికి బాసటగా ప్రభుత్వం నిలుస్తోందని, సమాజంగా కూడా వారికి అండగా ఉండాలన్నారు. మానసికంగా సమాయత్తం అవ్వాల్సి ఉందని అన్నారు.