-భారతీయ జనతా పార్టీ మోటార్లకు మీటర్లు పెట్టదు
-కేసీఆర్ జాతీయ పార్టీ ఈ పది సంవత్సరాల్లో అతిపెద్ద జోక్
-తెలంగాణలో చెల్లని రూపాయి కేసీఆర్… ఇక దేశంలో ఈ రూపాయి చెల్లుతుందా?
-ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి
-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం అనేదే… ఈ పది సంవత్సరాల్లో అతిపెద్ద జోక్. ఉట్టికి ఎగరనోడు… ఆకాశానికి ఎగిరాడట. దళితులను దగా చేసిన వ్యక్తి కేసీఆర్. పరిపాలించే సత్తా లేనోడు కేసీఆర్. మోడీపై కల్వకుంట్ల కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తోంది. దేశంలో కుటుంబ పాలన తేవాలని… కుటుంబ పార్టీలన్నిటిని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా… ప్రజాస్వామ్య పాలన చేయడమే మోడీకి తెలుసు.
ఎన్డీఏ కు ఎప్పటికీ కెసిఆర్ ప్రత్యామ్నాయం కానే కాడు.కెసిఆర్ కు ఉన్నదే 7 సీట్లు.. ఇక కేసీఆర్ ఏం చేస్తాడో మీరే ఆలోచించండి.వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కు 17 స్థానాల్లో ఒక్క సీటు కూడా రాదు.పంచాయితీ నుంచి పార్లమెంటు వరకు… గల్లి నుంచి ఢిల్లీ వరకు… 130 కోట్ల మంది ప్రజలతో జాతీయ జెండాను ఎగరవేసిన చరిత్ర బిజెపి ది…. నరేంద్ర మోడీది.
కేసీఆర్ ది అతిపెద్ద అవినీతి కుటుంబం.కేసీఆర్ ది అవినీతి, నియంతృత్వ పాలన.మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని చేతిలో పెడితే… అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసిఆర్ దే.మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదు.ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి.రానున్న రోజుల్లో ఉద్యోగులు ఎవరికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి.ట్రాన్స్కో, jenco లకు రూ.40వేల కోట్లు అప్పు ఉంది ఈ ప్రభుత్వం.భారతీయ జనతా పార్టీ మోటార్లకు మీటర్లు పెట్టదు.తప్పకుండా కేసీఆర్ అవినీతికి మీటర్లు పెడుతుంది.
కేసీఆర్ ఏం చేశాడని దేశవ్యాప్తంగా కేసీఆర్ పాలన కావాలి?దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది?దళితులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కేసీఆర్ ది.దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ ఏమైంది?నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా… మోసం చేసిన చరిత్ర కేసీఆర్ ది.కేజీ టు పిజి హామీ ఏమైంది?సంక్షేమ హాస్టల్లో రాళ్లతో అన్నం పెడుతున్నారు… కలుషిత ఆహారం తిని విద్యార్థులు మరణిస్తున్న ఘటనలను చూస్తున్నా.
మజ్లిస్ కు, ఓవైసీకి భయపడే పార్టీ బిజెపి కాదు.మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నాడు కేసీఆర్.కేసీఆర్ కుర్చీలో కూర్చున్నా… స్టీరింగ్, బ్రేక్ ఓవైసీ చేతిలోనే ఉంది.ఈ పాలనా దేశానికి కావాల్సింది?ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్… కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం అనడమే.
8వ నిజాం కేసీఆర్.కేసీఆర్ లాంటి అరాచక వ్యక్తి, అవినీతిపరుడు ఇంకెవరూ లేరు.కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణను దోచుకున్నది సరిపోదట.బీజేపీ యేతర పార్టీలకు కేసీఆర్ ఎలా డబ్బులు పంపిస్తున్నాడో ప్రజలందరికీ తెలుసు.తెలంగాణలో చెల్లని రూపాయి కేసీఆర్… ఇక దేశంలో ఈ రూపాయి చెల్లుతుందా?కెసిఆర్ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.తెలంగాణ మోడల్ అంటే ఏంటో… బిజెపి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు తెలుస్తుంది.ప్రజా ఉద్యమాలను అడ్డుకోవడం.. ప్రజలకు అందుబాటులో లేకపోవడమేనా ‘తెలంగాణ మోడల్’ అంటే?
ఇదేనా దేశ ప్రజలకు కావాల్సిన పాలన?రజాకార్లను ఉరికించిన చరిత్ర తెలంగాణది.ఖాసీం రజ్వీ పాకిస్తాన్ కి పారిపోయాడు.. ఖాసీం రజ్వీ చెంచాలను చంకలో పెట్టుకుని తిరుగుతున్నాడు.ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ను ప్రజలు తరిమికొట్టడం ఖాయం.లక్ష మంది కేసీఆర్ లు, లక్ష మంది ఓవైసీలు వచ్చినా… 2024లో వచ్చేది బీజేపీ నే.ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.