– శ్రీనన్న అందరివాడు అనే పేరుతో బయోపిక్
హైదరాబాద్: రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత, రాజకీయ జీవితంపై ‘శ్రీనన్న అందరివాడు’ అనే పేరుతో బయోపిక్ రానుంది. ఈ సినిమాకి బయ్యా వెంకట నర్సింహ రాజ్ దర్శకత్వం వహిస్తారు. పొంగులేటి పాత్రలో సీనియర్ నటుడు సుమన్ నటించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.