Suryaa.co.in

Andhra Pradesh

వరుసగా నాలుగో సారి లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా ఎం పి బాలశౌరి

గత మూడు పర్యయలుగా లోక్ సభ సభార్దినేట్ లేజిస్లేషణ్ కమిటీ చైర్మన్ గా పదవీ భాద్యతలు నిర్వహిస్తున్న మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారికి వరుసగా నాలుగవ సారి కూడా చైర్మన్ పదవి వరించింది. గత మూడు సంవత్సరాలుగా లోక్ సభ సభార్దినేట్ లేజిస్లేషణ్ కమిటీ చైర్మన్ గా ఎంతో సమర్ధవంతంగా పదవి బాధ్యతలు నిర్వహించి, అటు ఉన్నతకాధికరులతోను, ఇటు కేంద్రం ప్రభుత్వం లోని పెద్దలతోను సత్సంభందాలు నెలకొల్పడం లోని చాకచక్యం వారికీ మరోసారి చైర్మన్ పదవి దక్కేటట్లు చేసింది.

లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషణ్ కమిటీ చైర్మన్ గా చాల తక్కువ సమయంలో , ఎక్కువ సమావేశాలు నిర్వహించిన ఘనత కూడా ఎం పి బాలశౌరి ఖాతాలో ఉండటం గమనార్హం. ఎంతో ఓర్పుతో, నేర్పుతో , కమిటీ లో అందరి సభ్యుల సహకారం తీసుకుంటూ , కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యాలతో ఎన్నో సమావేశాలు నిర్వహించి , అక్కడి సమస్యలను కూలంకషంగా అర్ధం చేసుకొని, తగిన పరిష్కార మార్గాలు వెదకడంలో ఎంతో ప్రతిభ కనపరచడం వలననే, మరోసారి కూడా సదరు అధ్యక్ష పదవి వరించడం జరిగింది.

తన యొక్క సేవలను గుర్తించి మరోసారి కూడా లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషణ్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించిన వై ఎస్ ఆర్ పార్టీకి, ప్రియతమ మఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి , పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.

ఈసారి కూడా ప్రభుత్వానికి అవసరమైన మేర శక్తి వంచన లేకుండా ఈ పదవి లో పాటుపడతానని , కమిటీ లోని అందరు గౌరవ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకొని, వారి యొక్క అనుభవాన్ని ఉపయోగించుకొని లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషణ్ కమిటీ మరింత సమర్ధవంతంగా పనిచేయడానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు.

LEAVE A RESPONSE