Suryaa.co.in

Telangana

కేసీఆర్…. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఇంజనీరింగ్ నైపుణ్యం ఇదేనా?

-లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం పంప్ హౌజ్ ను నీటిపాల్జేస్తావా ?
-వందల కోట్లతో నిర్మించిన సిరిసిల్ల, జనగాం కలెక్టరేట్లను ముంచుతావా?
-గొప్పగా చెప్పుకున్న యాదాద్రి నిర్మాణాలూ కుంగిపోవడం సిగ్గుచేటు
-మీ 8 ఏళ్ల పాలనలో పన్నులు పెంచడం… ప్రజలను ముంచడం తప్ప సాధించేదేమిటి?
-ఇకనైనా కోతలు బంద్ చేసి ప్రజల గోసను పట్టించుకోండి
-సీఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్

ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యంవల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నారం పంప్ హౌజ్ నీటి మునిగిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. అంచనాల వ్యయాన్ని పెంచి వేల కోట్లు దోచుకోవడంలో చూపిన శ్రద్ధ ప్రాజెక్టు నిర్మాణంలో చూపకపోవడం సిగ్గు చేటన్నారు. అపర భగీరథుడు, తెలంగాణలో నదులకు నడక నేర్పినోడు, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ నిపుణుడిని తానేనని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ నిర్వాకంవల్ల వేల కోట్ల రూపాయలు వ్రుధా కావడమే కాకుండా మంథని, ధర్మపురి నియోజకవర్గాలు ఈరోజు పూర్తిగా నీటమునిగిపోయాయన్నారు. వందల కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన సిరిసిల్ల, జనగాం జిల్లా కలెక్టరేట్ భవనాలు సైతం నీటి మునిగి, గోడలు నెర్రెలు పాయడం దారుణమన్నారు. ప్రపంచంలోనే గొప్ప నిర్మాణమని ప్రచారం చేసుకున్న యాదాద్రి నిర్మాణాలు సైతం నీటికి వంగిపోవడం అత్యంత సిగ్గు చేటన్నారు.

LEAVE A RESPONSE