Suryaa.co.in

National

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో ఎంపీ జీవీఎల్ భేటీ

– కాశీ, మథుర, ప్రయాగరాజ్, గోరఖ్నాథ్ లో వసతులు ఏర్పాటు

యూపీ ఎన్నికల్లో విజయభేరీ మోగించి అద్వితీయ విజయాన్ని కైవసం చేసుకొని ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని ఎంపీ జీవీఎల్ నరసింహారావు కలిసి అభినందించారు. ఈ ఎన్నికల విజయం చరిత్రాత్మకమైనదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగితో 15 నిముషాల పాటు ఏకాంతంగా భేటీ అయ్యి ఎన్నికల ఫలితాలపై చర్చించారు.

దక్షిణాది నుండి, అందులో తెలుగు రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో కాశీ, మథుర, ప్రయాగరాజ్, గోరఖ్నాథ్ పుణ్య క్షేత్రాలకు భక్తులు వస్తారని యోగి ప్రస్తావించారు. వారి సౌకర్యార్థం వసతులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎంపీ జీవీఎల్ చెప్పగా, యోగీ చాలా సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు త్వరలో రావాలని యోగిని ఎంపీ జీవీఎల్ కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.

LEAVE A RESPONSE