హైదరాబాద్: ఇబ్రహీం పట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఆర్ అండ్ బి పరిధిలోని పలు రోడ్లు అభివృద్ధి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నాడు కలిసి వినతి పత్రం ఇచ్చారు.
పెరిగిన ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని సింగిల్ రోడ్ నుండి డబుల్ రోడ్,డబుల్ రోడ్ నుండి ఫోర్ లేన్ రోడ్లుగా విస్తరణ చేపట్టాలని వారు మంత్రిని కోరారు. సుమారు 383 కోట్ల పనులకు సంబంధించిన ప్రపోజల్స్ ఈ సందర్భంగా మంత్రికి అందజేశారు. పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలో రోడ్ల విస్తరణకు సంబంధించి గతంలో హామీ ఇచ్చానని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి సంబంధిత పనులు మంజూరు కు చర్యలు చేపడతామని తెలిపారు.