Suryaa.co.in

Andhra Pradesh

కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా ఎంపీ పురందేశ్వరి

రాజమహేంద్రవరం: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సిపిఎ) ఇండియా రీజియన్ ప్రతినిధిగా కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేట్ చెయ్యడం జరిగింది.

ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. 2026 చివరి వరకు ఈ నియామకం వర్తిస్తుంది. సిపిఎ ఇండియా రీజియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలుగానే కాకుండా మహిళా పార్లమెంటేరియన్లు, స్టీరింగ్ కమిటీకి చైర్‌పర్సన్‌గా కూడా ఆమె వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE