Suryaa.co.in

Andhra Pradesh

ఉన్నది ఉన్నట్లు చెబితే నేరమా? నువ్వు చేసిన తప్పును తప్పంటే రాజద్రోహమా?

– వారు ఉన్మాదులైతే … మనం సన్మా దులమా?
– మన దరిద్ర ఆలోచనలను ప్రజలపై రుద్దడమెందుకు?
– విజయసాయిని అవమానించడం మంచిది కాదు
– వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ఉన్నది ఉన్నట్లు చెబితే నేరమా?… నువ్వు చేసిన తప్పును తప్పంటే రాజద్రోహమా?? అంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు. జగనన్న ప్రభుత్వమే లేకపోతే స్కీములు ఉండవని… తాను చేపడుతున్న సంక్షేమ యజ్ఞాన్ని కొంతమంది మారీచులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పరోక్షంగా తన చేతగానితనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై కి నేపాన్ని నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో దుష్ట చతుష్టయమంటూ ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్l లను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ” ఉన్మాదులు… రాక్షసులంటూ ” తిట్టి పోయడాన్ని కూడా రఘు రామ తీవ్రంగా ఆక్షేపించారు.

వారు ఉన్మాదులైతే … మనం సన్మా దులమా?, వాళ్లు రాక్షసులైతే… మనము దేవి , దేవతల మా?? అంటూ జగన్మోహన్ రెడ్డి నీ నిలదీశారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై, విజయవాడలో దివ్యాంగురాలు పై జరిగిన అత్యాచార బాధితురాలి పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ను ప్రశ్నించిన పాపానికి, ప్రతిపక్ష నేత చంద్రబాబును తన ఎదుట హాజరుకావాలని ఆదేశించడం వంటి సంఘటనల తో పాటు… రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల తీరుతెన్నులపై, అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న తిప్పలు గురించి… వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డిని పార్టీ బాధ్యతల నుంచి తప్పించి అనుబంధ విభాగాల ఇన్చార్జ్ గా నియమించిన తీరును తప్పుపడుతూ.. తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు.

ప్రముఖ గాయని ఎస్ జానకి కి రఘు రామ, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ… ఆమెతో తనకున్న పరిచయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జానకి ఆలపించిన పలు జనరంజకమైన పాటల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ తరానికి జానకి గానమాధుర్యాన్ని పరిచయం చేసే ప్రయత్నాన్ని రఘురామ చేశారు. జానకి 40 నుంచి 45 సార్లు ఉత్తమ గాయనిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకున్నారని, అలాగే పలు రాష్ట్రాలు సన్మాన, సత్కారాలు, వివిధ సంస్థల నుంచి పురస్కారాన్ని అందుకున్నారని పేర్కొన్నారు.

ఇక… రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటుందని… తమకు మెజారిటీ వచ్చింది కదా అని ప్రతిపక్షమే ఉండొద్ద నుకోవడం అవివేకమే అవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రతిపక్షం తప్పు జరిగితే దాన్ని భూతద్దంలో చూపెడుతుందన్న ఆయన, తప్పే జరగకపోతే భూతద్దం లో చూ పెట్టినా శూన్యమే కనపడుతుందన్నారు. ప్రతిపక్ష నేతలను పట్టుకొని దుర్మార్గులు, రాక్షసులని నిందించడం అవివేకం అవుతుందని అన్నారు. ఎవరు ఉన్మాదులో, ఎవరు సన్మాధులో … ఎవరు రాక్షసులో… దేవి, దేవతలలో ప్రజలు డిసైడ్ చేయాలని, అలాగే కే… చంద్రబాబు కంటే తాను చాలా బెటర్ అని ఆరుసార్లు జగన్ చెప్పుకున్నారని, ఈ విషయాన్ని మనకు మనం చెప్పుకోవడం కాదని ప్రజలు డిసైడ్ చేయాలన్నారు.

ప్రజల నుంచి స్వచ్ఛందంగా ఈ మాటలు రావాలని సూచించారు సూచించారు. వింత వింత పోకడలు ద్వారా మనం చేస్తున్న కార్యక్రమాలతో ప్రజల నుంచి ఎక్కడ కూడా ఆ మాటలు వినిపించడం లేదన్నారు. ముఖ్యమంత్రి గారు… ఈ విషయాన్ని తెలుసుకుంటే తమ పార్టీ వైఎస్సార్సీపీకి మంచిదనీ రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. సంక్షేమం చేస్తున్నా… సంక్షేమం చేస్తున్నామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు తన హయం లోనే అమలు జరుగుతున్నట్లు చెప్పుకోవడం హాస్య స్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ 35 వేల కోట్లు సంక్షేమ పథకాలు అమలు జరిగాయన్నారు.

ఈ ప్రభుత్వ హయాంలో రెండు, మూడు కోట్లు అటు ఇటుగా సంక్షోభ … సంక్షేమ కార్యక్రమాలు జరిగితే జరిగి ఉండవచ్చని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు నేరుగా ఫీజులు అందేవన్న ఆయన, ఆఖరి సంవత్సరం ఫీజులు చెల్లింపులో ఆలస్యం జరిగితే జరిగి ఉండవచ్చునని పేర్కొన్నారు. దాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దానికి గత ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్లుగా చిలవలు పలవలుగా మాట్లాడడం తగదని అన్నారు.. వైయస్సార్సీపి ప్రభుత్వ హయంలో ఒక ఏడాది అమ్మ ఒడి ఎగ్గొట్టినట్లుగానే , చివరి క్వార్టర్ లో బడ్జెట్ కారణాల రీత్యా గత ప్రభుత్వ హయాంలో ఫీజుల చెల్లింపులో ఇబ్బంది జరిగితే జరిగి ఉండవచ్చునని రఘురామ పేర్కొన్నారు.

దానికి తన జేబులో డబ్బులు ఇస్తున్నట్లుగా, గత ప్రభుత్వ పెద్దలను దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నం తగదన్నారు.. విద్యార్థుల సమస్యలను నేరుగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ కి సూచించిన రఘు రామ, మీరు ఇంట్లో నుండి బయటకు రావడం లేదని అందుకే విద్యార్థుల సమస్యలు కనిపించడం లేదని అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రినీ కలవకుండా దారులు మూసి వేస్తున్నారని, ప్రజలను ఎక్కడికక్కడ నిర్బందిస్తున్నారని తెలిపారు. ప్రజలకు సమస్యలు విన్నవించు స్వేచ్ఛ కూడా లేదని తెలిపారు. పెయిడ్ ఆర్టిస్ట్ ల ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు.. కళాకారులను తీసుకొచ్చి దూరంగా కూర్చోబెట్టి, ఒకరిద్దరిని వేదిక మీదికి పిలిపించి మాట్లాడుతున్నారని అని ఎద్దేవా చేశారు.

ప్రజల్లో ఏం జరుగుతుందన్న దానిపై స్పష్టత కరువైందని రఘు రామ పేర్కొన్నారు. విద్యార్థులకు సకాలంలో ఫీజులు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు..విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలు కేవలం పేరుకే నని… అమ్మ ఒడి కార్యక్రమం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని… ఈ సంవత్సరం ఈ పథకం కింద విద్యార్థులకు డబ్బులు ఇవ్వడంలేదని రఘు రామ అన్నారు. నగదు బదిలీ కార్యక్రమంపై ప్రజల నుంచి రెఫరెండం కోరినట్లుగానే విద్యార్థుల సమస్యలపై కూడా రిఫరెండం కోరాలని ఆయన డిమాండ్ చేశారు.. నగదు బదిలీ పథకాన్ని నూటికి 99 శాతం మంది ఛీ.. కొట్టారని అయినా సిగ్గు లేకుండా ముందుకు వెళ్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఈ పథకం అమలు విషయంలో, ప్రస్తుతానికైతే ప్రభుత్వ పెద్దలు తోకముడిచి నట్లు గానే కనిపిస్తుందని అన్నారు.. నగదు బదిలీపై ముందుకు వెళితే కనుక ప్రజల చేతిలో చావు దెబ్బలు తినడం ఖాయమని రఘు రామ , ముఖ్యమంత్రిని హెచ్చరించారు.. మనకు వచ్చిన దరిద్రపు ఆలోచనలను ప్రజల పై రుద్దాలనుకోవడం సరి కాదన్న విషయం… సర్వేలో తేలిన తర్వాత కూడా దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తామని చెప్పడం మూర్ఖత్వమే అవుతుందని విమర్శించారు. ప్రజలు వద్దని చెప్పినా కూడా అదే కార్యక్రమాన్ని చేపడతామంటే ప్రజలు తంతారన్న ఆయన , ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రణాళికలతో ప్రజల ముందుకు వెళ్లడం మానుకోవాలని సూచించారు.

నగదు బదిలీ పథకంపై ప్రజాభిప్రాయం కోరుకున్నట్లుగానే విద్యా దీవెన, విద్య వసతి కార్యక్రమాలపై కూడా విద్యార్థుల నుంచి రిఫరెండం కోరారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లకు సొమ్ము బదిలీ చేయడమా?, లేకపోతే నేరుగా కాలేజీ అకౌంట్ లోకి సొమ్ము బదిలీ చేయడం అన్నదానిపై విద్యార్థులు అభిప్రాయాన్ని కోరితే… మంచిదని పేర్కొన్నారు. ఈ విషయమై విద్యార్థులు కూడా స్పందించాలని రఘురామరాజు సూచించారు. ప్రభుత్వం ద్వారా అందజేసే ఫీజు మొత్తాన్ని నేరుగా కాలేజీ అకౌంట్లో జమ చేయమంటారా?

తల్లి అకౌంట్ లోకి జమ చేసినా, సకాలంలో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడతామని అంటారా?? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు విద్యార్థులకు కూడా ఉందని ఆయన అన్నారు. విద్యార్థుల కోరికకు భిన్నంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తానని అంటే చెల్లదని తేల్చి చెప్పారు. తమకు చెల్లించే ఫీజు నేరుగా కాలేజీ అకౌంట్లో జమ చేయాలని విద్యార్థులు ఇకనైనా కోరాలని రఘు రామ వెల్లడించారు. ప్రతి స్కీమ్ లో ఒక స్కాం ఉన్నదన్న ఆయన విద్యుత్తు వినియోగం 300 యూనిట్లు దాటితే… ఏమి ఇవ్వనని చెబుతున్న జగన్ మోహన్ రెడ్డి, ఎందుకని వెయ్యి రూపాయల మద్యం సేవిస్తే… పోనీ పదిహేను వందల రూపాయల మద్యం సేవిస్తే ప్రభుత్వ పథకానికి అనర్హులంటూ ప్రకటించరని నిలదీశారు.

మూడు రోజుల వ్యవధిలోనే ఒక్కొక్కరు వెయ్యి రూపాయల పై చిలుకు మద్యాన్ని సేవించి తమ ఆరోగ్యాన్ని గుల్ల చేసుకోవడమే కాకుండా కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ కార్డుల ద్వారా మద్యం విక్రయాలు చేపట్టాలంటూ రఘురామ కృష్ణంరాజు సూచించారు. ఎవరన్నా పదిహేను వందల పైచిలుకు మద్యం సేవిస్తే, వారికి మద్యం విక్రయాలు చేయమని చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమైనా, ప్రభుత్వంలోని పెద్ద లైన బతకాలన్న మద్యం ఆదాయం ఒకటే మార్గం అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజ మెత్తారు.

ఎలాగో తమ సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించ దని… అయినా ప్రజలకు తెలియాలని చెబుతున్నానని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రుణం లభించాలంటే అర్హత ఉండాలన్నా ఆయన, అదే ఉంటే… ప్రధాని నరేంద్ర మోడీకి తాను లేఖ రాసినా.. ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లలో వార్తలు రాసిన, టీవీ 5 లో డిబేట్ పెట్టిన ఇవ్వకుండా ఉండరని చెప్పారు. అదే మన జి ఎస్ డి పి బాగా ఉంటే, మన అర్హత ను బట్టి కేంద్రం రుణం ఇస్తుందని తెలిపారు. ఇప్పటికే మనము అక్రమ, అక్రమ మార్గాల ద్వారా అర్హతకు మించి రుణాలు పొంది ఉన్నామని పేర్కొన్నారు.

293(3) నిబంధనలను బేఖాతరు చేసి, కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో రుణాలను పొందామని గుర్తు చేశారు. నిబంధనలకు భిన్నంగా తమ రాష్ట్రానికి ఇంకా రుణాలు ఇవ్వాలని కోరాలంటూ ఎద్దేవా చేశారు. ఒకవైపు తామే తప్పులు చేస్తూ ఇతరులను దెప్పిపొడుస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగురాలు పై జరిగిన అత్యాచారం ఘటన గురించి మహిళా కమిషన్ చైర్మన్ ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నేత అని తన ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంపై రఘురామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత శాఖ మంత్రికి పూర్తి వివరాలు తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు చూస్తున్నారని, గమనిస్తున్నారని పేర్కొన్నారు.

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు పై వ్యక్తిగత కక్షపూరితంగా సాగిస్తున్న దాడిని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టిందన్నారు. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కూడా సమర్థించడం ఆయన్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించడం ప్రభుత్వానికి చెంపపెట్టు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. వైయస్సార్ సిపి లో విజయ సాయి రెడ్డి కి అనుబంధ సంఘాల ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించి అవమానించడం సరికాదని రఘురాం. ఆయన , తాను సామాజిక మాధ్యమం ద్వారా ఎన్ని విమర్శలు చేసుకు న్నా.. ఈ రకంగా పార్టీ నాయకత్వం ఆయన్ని అవమానించడం తనకు నచ్చలేదని అన్నారు. ఈ లెక్కన రాజ్యసభ పదవీ కాలం ముగిసిన తర్వాత, రెండవ సారి ఆయనకు మళ్లీ రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందో లేదోనన్న అనుమానం వ్యక్తం చేశారు .

LEAVE A RESPONSE