Suryaa.co.in

Telangana

కే.సి వేణుగోపాల్ తో ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ

-ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్ తో సమావేశమైన టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
-రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ, టిఆర్ఎస్ లోపాయకారి వ్యవహారాలు, పార్టీ లో చేరికలు, రాహుల్ గాంధీ పర్యటనలు, విద్యార్థి, నిరుద్యోగ డిక్లరేషన్, దళిత, గిరిజన డిక్లరేషన్ తదితర అంశాలపై కే.సి వేణుగోపాల్తో చర్చించారు

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీలోకి అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున చేరికలు ఉంటాయి. చేరికల జాబితాపై అధిష్టానంతో చర్చించాం. పలు పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు దశల వారీగా విడతల వారీగా చేరికలు ఉంటాయి. కేంద్రాన్ని మోడీని కేసీఆర్ ప్రశ్నించలేదు కెసిఆర్ ను రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను మోడీని ప్రస్తావించలేదు. మోడీ కేసీఆర్ లు కావాలని కూడబెల్కొని విమర్శలు సాగించారు. తెలంగాణలో ఉంటే మనిద్దరం…. మన రెండు పార్టీలు ఉండాలని ఉద్దేశంతో మోడీ కేసీఆర్ ను వ్యవరించారు. ఇద్దరి నాటకాలను ప్రజలకు వివరించే కార్యాచరణతో ముందుకు పోతాం. భిన్న అభిప్రాయాలను భేదాభిప్రాయాలుగా చూడరాదు. పార్టీలో చేరే వారితోపాటు ముందు నుంచి పార్టీలో ఉండి సిద్ధాంతాలకు కట్టుబడి వారికి ప్రాధాన్యత ఉంటుంది. టికెట్లనేది ఎన్నికల పట్టి వ్యవహారం.

LEAVE A RESPONSE