కాకినాడ : కాకినాడ జిల్లా ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు మంచి స్పందన లభిస్తోంది. శుక్రవారం ఆయన కార్యాలయంలో 32వ వారం ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజాదర్బార్‌కు హాజరై తమ అర్జీలను సమర్పించారు.
ఫీజు రీయింబర్స్మెంట్, సిఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తులు, ఇంటి స్థలం, రేషన్ కార్డు, దివ్యాంగులు, వితంతువు మరియు వృద్ధాప్య పింఛన్ల వంటి అంశాలపై మొత్తం 28 అర్జీలు అందాయి.వాటిలో 9 అర్జీలను సంబంధిత అధికారులతో వెంటనే సంప్రదించి పరిష్కరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి నాయకులు న్యూటన్ ఆనంద్ మాట్లాడుతూ, ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా ప్రజాదర్బార్‌ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, గత 31వారాల్లో అనేక సమస్యలకు పరిష్కారాలు చూపించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జున్నూరు బాబ్జి, నులుకుర్తి వెంకటేశ్వరరావు చింతపల్లి అర్జున్, , హరి, డి.ఆర్.యు.సి.సి సభ్యులు ముత్యాల అనిల్, కొండబాబు, ఐటిడిపి నాయకులు పాలిక సతీష్, దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.