ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరుత్తణిలో కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
మంగళవారం చాలా విశేషమైన ముక్కోటి ఏకాదశి (పుత్రదా ఏకాదశి)రోజున సుప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి-వల్లి దేవసేన అమ్మ వార్ల ఆలయాన్ని సందర్శించి ఉత్తర ద్వారా దర్శనం (వైకుంఠ ద్వారం) చేసుకున్నారు.వద్దిరాజు కిషన్-శశిరేఖ, వద్దిరాజు దేవేందర్ -ఇందిర, వద్దిరాజు రవిచంద్ర -విజయలక్మీ, వద్దిరాజు వెంకటేశ్వర్లు-ఉమా మహేశ్వరి, శీలం సత్యనారాయణ- లక్ష్మీ, డాక్టర్ జే.ఏన్.వెంకట్-సునీత, వద్దిరాజు శ్రీనివాస్ -శిల్ప, బోరిగం విజయ్-మాధవి, డాక్టర్ గంగుల గంగాభవాని, రౌతు కనకయ్య-సుధారాణి, ఈ.వెంకటేశ్వర్లు-వసంతలక్మీ, బోరిగం స్వరూపారాణి, వద్దిరాజు ప్రీతమ్, వద్దిరాజు నందన్, వద్దిరాజు సుశ్రుత్, వద్దిరాజు సాన్విత్, గంగుల సనవ్, గంగుల సౌరవ్ తదితరులు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుని తమ గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా వేద పండితులు ఎంపీ రవిచంద్ర తదితరులను శాలువాలతో సత్కరించి ఆశీర్వచనాలు అందించారు.
తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలి: ఎంపీ వద్దిరాజు
తెలంగాణ రాష్ట్రం,ప్రజలు పాడి పంటలు,శాంతి సౌభాగ్యాలతో చిరకాలం వర్థిల్లాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రార్థించారు.బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి-దేవసేన అమ్మ వార్లను ఎంపీ రవిచంద్ర వేడుకున్నారు.