Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీకి మద్దతు ప్రకటించిన ముస్లిం సంఘాలు

మైనార్టీలకు అండగా తెలుగుదేశం

తప్పుడు ప్రచారాలతో విధ్వేషాలు, విబేధాలు సృష్టించేలా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 2014-19 మధ్య కాలంలో మైనార్టీల కోసం బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో నిధుల్లో కోతపెట్టారు. గతంలో అమలు చేసిన పథకాలను రద్దు చేసి ముస్లింలను వంచించాడు.

రంజాన్ తోఫా, దుకాన్ మకాన్, దుల్హన్, మసీదులు మరమ్మతులకు నిధులివ్వడం లాంటి పథకాలు రద్దు చేశాడు. అబ్దుల్ సలాం కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవడానికి కారణం జగన్ రెడ్డి అరాచకమే మిస్బా అనే పదో తరగతి చదివే బాలికను వేదించి ఆత్మహత్య చేసుకునేలా చేసిందీ జగన్ రెడ్డి ముఠానే. ఇలా చెప్పుకుంటూ పోతే గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో ముస్లిం మైనార్టీలకు రక్షణ ప్రశ్నార్ధకంగా మారింది. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కాపాడింది తెలుగుదేశం పార్టీయే. ‘గతంలో అధికారంలో ఉన్నపుడు ముస్లింలకు అన్ని రంగాల్లో అండగా నిలిచి, న్యాయం చేసింది తెలుగుదేశమే. ఇప్పుడు జగన్ రెడ్డి పాలనలో నష్టపోయిన ముస్లింలకు న్యాయం చేసేది కూడా నేనే’. మతపరమైన అంశాల్లో ముస్లింలకు ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకునేది తెలుగుదేశం పార్టీయే. జగన్ రెడ్డి చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. ముస్లిం నాయకులపై దాడులు పెరిగిపోయాయని, దౌర్జన్యాలు పెచ్చుమీరాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల మద్దతు తెలుగుదేశం పార్టీకే ఉంటుందని, సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింల చేతుల్లోనే వైసీపీ ఓటమి ఖాయమవుతుందన్నారు. ఈ సమావేశంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అద్యక్షులు రఫి, ప్రధాన కార్యదర్శి మీర్షా బాబు, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూఖ్ షుబ్లీ, కరీముల్లా, రఫీ అహ్మద్, షబ్బీర్, అప్షేర్, షఫీ, మహబూబ్ బాషా, టీడీపీ నేతలు సయ్యద్ రఫీ, ఎస్.పి.సాహెబ్, హసన్ బాష పాల్గొన్నారు.

LEAVE A RESPONSE