Suryaa.co.in

Andhra Pradesh

నెల్లూరు నుంచే ముఖ్యమంత్రి జగన్ పై ముస్లింల తిరుగుబాటు

– జగన్ సర్కార్ పై ముస్లింల సమర భేరీ…
– శాంతియుత నిరసనతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం…
-జగన్ సర్కార్ బాధ్యతలు, సర్కార్ ధర్మాలను గుర్తు చేస్తాం…
-తీరు మారకపోతే పోరాటం తీవ్రతరం చేస్తాం….
-సమర భేరికి వేలాదిగా తరలిరండి…
– అబ్దుల్ అజీజ్, టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు…

నెల్లూరు నగరంలోని పిచ్చి రెడ్డి కళ్యాణ మండపం లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముస్లింల సమరభేరీ ఏర్పాట్లను బుధవారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జి అబ్దుల్ అజీజ్ జిల్లా టీడీపీ నేతలతో కలిసి పర్యవేక్షించారు.
అందులో భాగంగా ముస్లిం సమర భేరి పోస్టర్ ను విడుదల చేసారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ…

గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ముస్లిముల కోసం సంక్షేమ పథకాలను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, ముస్లింల తిరుగుబాటు నెల్లూరు నుంచే ప్రారంభమయిందని టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు…

వైయస్ జగన్ ప్రభుత్వ లో ముస్లింల సంక్షేమం ఎండమావిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ముస్లింల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను అర్ధాంతరంగా ఆపివేశారన్నారు.దీంతో ముస్లింలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ కరువైందని ఈ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని ధ్వజమెత్తారు.

కార్యక్రమంలో చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జెడ్ శివ ప్రసాద్, తాళ్ళపాక అనురాధ, జెన్నీ రమణయ్య, పమ్మిడి రవి కుమార్, చౌదరి, మైనుద్దిన్, జాఫర్ షరీఫ్, సాబీర్ ఖాన్, నన్నే సాహెబ్, కప్పిర శ్రీనివాసులు, జలదంకి సుధాకర్, ఖాదర్ బాషా, మల్లిక, రేవతి, ప్రశాంత్, కువ్వారపు బాలాజీ, సుబహాన్, SA రసూల్, అశ్లాం, ముణీర్, దోర్నాల హరి బాబూ, రబ్బానీ, నవీన్ తదితరులు పాల్గొన్నారు..

LEAVE A RESPONSE