Suryaa.co.in

Andhra Pradesh

గోదావరి నీళ్ళు రాయల సీమకు తీసుకు వెళ్ళడమే నా లక్ష్యం

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలో నారా చంద్రబాబునాయుడు రోడ్ షో

పెద్దిరెడ్డి దోపిడీ కోసమే కొత్త ప్రాజెక్ట్ ల రూపకల్పన

జరిగేది కురుక్షేత్ర…..వైసీపీ కౌరవులను ఓడించాలి

రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగం :-



•శ్రీకాళహస్తి రాగానే నాకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గుర్తుకువచ్చారు. ఉన్నతమైన రాజకీయాలు చేసిన వ్యక్తి బొజ్జల. ఆయన ఒకటి అనుకుంటే అయిపోవాల్సిందే.

• బొజ్జల కుటుంబం మూడుతరాలుగా ప్రజల్లో ఉన్నారు. బొజ్జల కుటుంబానికి….బియ్యపు మధుసూదన్ రెడ్డికి పోలిక ఉందా.

• సైకో అని పోస్టర్ పెడితే ఎమ్మెల్యే బియ్యపు రెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడు?

• సైకో పాలన చేస్తున్న వాళ్లని ప్రజలు సైకోలని పిలుస్తుంటే, అధికారులకు వచ్చిన నష్టం ఏంటి?

• గత ఎన్నికల్లో సైకోకి సహకరించడం వల్లే రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయాయి

• హైదరాబాద్ అభివృద్ధి తరహాలోనే రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి నాంది పలికి ఎన్నో పరిశ్రమలు తెచ్చా

• కమీషన్ల కోసం ఎమ్మెల్యే బియ్యపు రెడ్డి చేస్తున్న కక్కుర్తి పనులకు ఉన్న పరిశ్రమలు పోయే పరిస్థితి

• సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో పాల్గొనేందుకు కాళహస్తికి వచ్చాను.

• దేశంలో నీటి కోసం యుద్దాలు జరుగుతున్నాయి. నీటికి అంత ప్రాధాన్యత ఉంది.

• రాయలసీమ ఎడారిగా మారిపోకుండా ఉండాలని నాడు ఎన్టీఆర్ సీమలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు.

• తెలుగు గంగ, నగిరి గాలేరు, హంద్రీనీవా ప్రాజెక్టులు ప్రారంభించింది అన్న ఎన్టీఆర్

• నీటి ప్రాధాన్యతను గుర్తించి 2014 తరువాత సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం.

• నేడు కనీసం కాలువలకు నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి.

• నాడు హైదరాబాద్ ను ముందుచూపుతో అభివృద్ది చేశాను. దీంతో ఇప్పుడు అక్కడ ఎకరా భూమి 100 కోట్లు అయ్యింది.

• అదే విధంగా ఏపీని కూడా అభివృద్ది చేద్దాం అనుకున్నా…కానీ ఎన్నికల్లో ఓటమితో ఆ కల నెరవేరలేదు.

• 2014 తరువాత చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున తయారీ పరిశ్రమలు తెచ్చాను.

• రేణిగుంట ఎయిర్ పోర్ట్ ను అభివృద్ది చేశాను.

• ఐఐటి, ఐఐఎస్ఇఆర్,ఐఐడిటి వంటి సంస్ధలు మన హయాంలో ఇక్కడికి వచ్చాయి.

• జగన్ వచ్చిన తరువాత ఒక్క సంస్థ వచ్చిందా….ఒక్క కంపెనీ వచ్చిందా?

• రాష్ట్రాన్ని అభివృద్దిలో పెట్టి ప్రజల జీవితాలు బంగారు జీవితాలు చేయాలి అనుకున్నా.

• కానీ జగన్ ఒక్క చాన్స్ కు, ముద్దులకు మీరు మోసపోయారు.

• సాగునీటి ప్రాజెక్టులపై ప్రశ్నించేందుకు నేను జిల్లాకువస్తే నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మన మీటింగ్ కి వచ్చిన కార్యకర్తలపై దాడులు చేశారు.

• డబ్బుల కోసం అవసరం లేని ప్రాజెక్టులు చేపట్టి పెద్దిరెడ్డి అక్రమాలు చేస్తున్నాడు.

• అవులాపల్లి ప్రాజెక్టు కు ఎన్జీటీ ఫైన్ వేసింది….దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫైన్ చెల్లించింది. పెద్దిరెడ్డి కోసం ప్రజల సొమ్ము ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి.

• అససరంలేని ప్రాజెక్టులు చేపట్టి పెద్దిరెడ్డి ప్రభుత్వ సొమ్ముకాజేస్తున్నారు.

• టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గోదావరి నీరు రాయలసీమకు తీసుకువచ్చి ఇక్కడ ప్రజల కష్టాలు తీర్చుతాను.

• పీఎల్ఆర్ కంపెనీ పెట్టిన పెద్దిరెడ్డి కాంట్రాక్టర్ గా వేల కోట్లు దోచుకుంటున్నాడు

• రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయి వాడకం పెరిగిపోయింది. శ్రీకాళహస్తిలో కూడా గంజాయి లభిస్తుంది. దీంతో పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చి మన బిడ్డలను దేశ విదేశాలకు పంపాను. వీళ్లు గంజాయి పంచుతున్నారు.

• ప్రజల సమస్యలపై నేను మాట్లాడితే నాపై పోలీసులతో దాడి చేయిస్తున్నారు. అయితే ఆ పోలీసుల సమస్యలు కూడా నేనే ప్రస్తావించాలి. పోలీసులకు టీఏ, డీఏలు వస్తున్నాయా?

• మాపై దాడులు చేసే వారు గుర్తుపెట్టుకోవాలి…ఇవాళ ఉంటుంది..రేపు ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి

• ప్రజాహితం కోసం పోలీసుల్లోనూ తిరుగుబాటు రావాలి

• పోలీసుల్ని నేరాల్లో భాగస్వాముల్ని చేద్దామని వైసీపీ చూస్తోంది

• ఒకరిద్దరు చెడిపోయిన పోలీసు ఉన్నతాధికారులు వల్ల మంచి పోలీసులకు చెడ్డపేరు వస్తోంది

• పోలీసులకు ప్రభుత్వం టీఏ, డీఏలు కూడా ఇవ్వకుండా, తెలుగుదేశం కార్యకర్తల్ని కొట్టమని మాత్రం లాఠీలు ఇస్తున్నారు

• ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రజాహితం కోసం పోలీసులు పనిచేయాలి

• తప్పు చేసిన ఏఒకరినీ వదలను….రాయలసీమకు మీరు నీళ్లు ఇవ్వలేదు అంటే నాపై దాడి చేశారు.

• నేను రాయలసీమలో నీళ్లు పారించాలి అని చూశాను…జగన్ రక్తం పారించాలి అని చూస్తున్నాడు

• ఎన్నిఇబ్బందులు పెట్టినా తెలుగు జాతి కోసం పారాడుతా….భారత దేశంలో తెలుగు వారిని నెంబర్ 1 చేస్తా.

• చిత్తూరు జిల్లాలో అమర రాజా సంస్ధ వేల మందికి ఉద్యోగాలు ఇస్తే వారిపైనా దాడులు చేశారు. వేధించారు. దీంతో వాళ్లు తెలంగాణకు వెళ్లి సంస్థను ఏర్పాటు చేశారు.

• జగన్ రెడ్డి పాలన వల్ల ఉన్నవీ పోతున్నాయి…కొత్తవీ రావడం లేదు.

• రాష్ట్రంలో నిత్యావసర ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. పన్నులు పెరిగాయి, కరెంట్ బిల్లులు పెరిగాయి.

• అందుకే సూపర్ సిక్స్ అని పథకాలు ప్రకటించాను.మహాశక్తి పథకం కింద మహిళలకు చేయూతనిస్తాను.

• స్థానిక ఎమ్మెల్యే సహా అక్రమాల ద్వారా తిన్న వైసీపీ ఎమ్మెల్యేలను తిన్నది అంతా కక్కిస్తా.

• రాష్ట్రంలో కురుక్షేత్ర యద్దం ప్రారంభం అయ్యింది. ధర్మాన్ని కాపాడడానికిజరిగిన యుద్దం కురుక్షేత్రం. ఆ కురుక్షేత్ర యుద్దంలో వైసీపీ కౌరవులను ఓడించాలి.

• శాసన సభను కౌరవ సభ ను చేసిన వారిని ఓడించాలి…సభను గౌరవ సభ చేస్తాను అని నేను ప్రకటించాను. దీని కోసం మీ మద్దతు కోరుతున్నా.

• రాష్ట్రం బాగుండాలి అని భావిచే వారంతా వైసీపీ నుంచి బయటకు రావాలి.

 

LEAVE A RESPONSE