– నా నడక ప్రారంభమైంది
– గద్దర్ కొత్త ‘గద్దర్ ప్రజా పార్టీ’
ఢిల్లీ: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రానుంది. ప్రజా గాయకుడు గద్దర్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు.. కొత్త పార్టీ ‘గద్దర్ ప్రజా పార్టీ’ పేరును గద్దర్ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో గద్దర్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఎన్నికల కార్యాయాలనికి గద్దర్ చేరుకున్నారు. రాజకీయ పార్టీ ‘గద్దర్ ప్రజా పార్టీ’ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల అధికారులను కలిశారు.