– టిడిపి చేస్తున్న పోరాటం లో పాల్గొంటా
– మహానాడు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు
– ఒంగోలు లో మహానాడు
– పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో టిడిపి అధినేత చంద్రబాబు చిట్ చాట్
ప్రభుత్వంపై ఈ స్థాయి ప్రజా వ్యతిరేకత చరిత్రలో చూడలేదు.ప్రభుత్వాలు విఫలం అవ్వడం వేరు…పాలనపై ఈ స్థాయి అసంతృప్తి వేరు.టిడిపి అత్యధిక సీట్లు గెలిచిన 1994లో కూడా ప్రజల్లో నాటి ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత లేదు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి.జగన్ పథకాలు వెనుక ఉన్న లూటీ ప్రజలు గుర్తించారు…తాము ఏం నష్టపోయామో వారికి తెలుస్తుంది.
ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సంక్షేమ పథకాలు కారణం కాదు…జగన్ లూటీ వల్లనే ఈ దుస్థితి.ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను దెబ్బతీసి జగన్ తన ఆదాయం పెంచుకుంటున్నాడు.మద్యం పై బహిరంగ దోపిడీ జరుగుతుంది…ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వ్యక్తుల జేబులోకి వెళుతుంది.మైనింగ్, ఇసుక ను సంపూర్ణంగా దోచుకుంటున్నారు….ఈ భారం ప్రజపైనే పడుతుంది.
రైతు వర్గంలో ఒక్క ఓటు కూడా ఇక వైసీపీకి పడే చాన్స్ లేదు.రైతులకు ఏడాదికి 7 వేలు ఇచ్చి…ఇతరత్రా వారిని పూర్తిగా విస్మరించారు. రాజకీయాల్లో వర్గ ద్వేషాలు ఉండకూడదు….కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకోవడం ఎప్పుడూ చూడలేదు.పవన్ పై కోపంతో ఒక సామాజికవర్గాన్ని, టిడిపిపై కోపంతో మరో వర్గాన్ని, రఘరామకృష్ణం రాజుపై కోపంతో మరో వర్గాన్ని టార్గెట్ చేశారు. జగన్ లో అపరిచితుడు ఉన్నాడు….జగన్ చెప్పే వాటికి చేసే వాటికి సంబంధం ఉండదు.
వైసీపీ ఇప్పుడు ఓడిపోతే మళ్లీ జీవితంలో అధికారంలోకి రాదు అనేదే జగన్ ఫ్రస్టేషన్ కు కారణం.జగన్ ఫ్రస్టేషన్ లోనే అతని భాషమారింది.కేబినెట్ విస్తరణ తో జగన్ బలహీనుడు అని తేలిపోయింది.ఒత్తిళ్లతో సగంమందిని క్యాబినెట్ లో తిరిగి కొనసాగించారు…..దీంతో బయట తిరుగుబాట్లు మొదలయ్యాయి. క్యాబినెట్ విస్తరణ అనంతరం బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రాలేదు.భవనం వెంకట్రామ్ కు కూడా ఇంత బలహీనంగా కనిపించలేదు.
నా ఇంటి మీద దాడికి వచ్చిన వారికి….లోకేష్ ను దూషించిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు.మంత్రి పదవులు పొందడానికి ఇదేనా అర్హత.ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంన్నాం
బాదుడే బాదుడు పేరుతో టిడిపి చేస్తున్న పోరాటం లో ను పాల్గొంటాను…మహానాడు వరకు బాదుడే బాదుడు కార్యక్రమం ఉంటుంది. మే మొదటి వారం నుంచి నా పర్యటనలు మొదలు అవుతాయి. మహానాడు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేపడతాను నెలకు రెండు జిల్లాల చొప్పున ఏడాదిలో అన్ని జిల్లాల పర్యటన పూర్తి చేస్తాను. ఒంగోలు లో మహానాడు నిర్వహిస్తున్నాం.