Suryaa.co.in

Andhra Pradesh Telangana

నా గెలుపు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు

పార్టీ నేతలు కార్యకర్తల కోసం చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేశాం
రాష్ట్ర విభజన తో జిల్లా అభివృద్ధి కోసం పార్టీ మారాం
గుండెల్లో భాద దిగమింగుకొని పార్టీ మారాం
అరాచక అవినీతి పాలన తరమి కొట్టాలని కాంగ్రెస్ పార్టీలో చేరినం
కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలని తుమ్మల పిలుపు
తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో తుమ్మల సంచలన వ్యాఖ్యలు

ఖమ్మం : నా గెలుపు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు.నా గెలుపు కోసం మద్దతుగా నిలిచిన తెలుగుదేశం శ్రేణులకు జీవితాంతం రుణపడి ఉంటా.భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో నా భుజం మీద చెయ్యి వేసి రాజకీయ జీవితం ఇచ్చిన పూజ్యులు ఎన్టీఆర్. భద్రాచలం నుంచి చర్ల వరకు ఆయన కారులో తీసుకెళ్లారు.

కృష్ణా జిల్లా మీనవోలు లో కలిసినపుడు సత్తుపల్లి లో పోటీ చేయమని ఆశీర్వదించారు. నా జేబులో ఏమీ లేకపోయినా నా వెనక ఎన్టీఆర్ ఉన్నారనే ధైర్యం తో ఎన్నికల్లో పోటీ చేశా. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు తల ఎత్తుకుని ఉన్నారంటే ఆ మహాను భావుడు దీవెనలే. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశం తో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశా. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష కోసం లక్షల మంది పార్టీ నేతలు కార్యకర్తల కోసం చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేశాం.

1999 లో చంద్రబాబు నాయకత్వం లో తెలుగుదేశం అధికారం లోకి వచ్చిందంటే ఎన్టీఆర్ ఇచ్చిన రాజకీయ చైతన్యం. రాష్ట్ర విభజన తో జిల్లా అభివృద్ధి కోసం పార్టీ మారాం. గుండెల్లో భాద దిగమింగుకొని పార్టీ మారాం. బీ.అర్.ఎస్. అరాచక అవినీతి పాలన తరమి కొట్టాలని కాంగ్రెస్ పార్టీలో చేరినం. తెలుగుదేశం శ్రేణులు నాకు మద్దతు గా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు అంటే ఎన్టీఆర్ ఆశీర్వాదం వల్లే.

 

LEAVE A RESPONSE