Suryaa.co.in

Andhra Pradesh

మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్రలో జగన్ రెడ్డి తట్టమట్టి అయినా వేశాడా?

• తాము, తమబినామీలు, తమకుటుంబాలు కొట్టేసిన భూములు, ఆస్తుల్ని కాపాడుకోవడానికే ధర్మాన, ఉత్తరాంధ్రమంత్రులు, ఆ ప్రాంతవాసుల్ని రెచ్చగొడుతూ, జగన్ రెడ్డి మూడుముక్కలాటకు వంతపాడుతున్నారు
• మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్రలో జగన్ రెడ్డి తట్టమట్టి అయినా వేశాడా?
• దశాబ్దాలుగా ఉత్తరాంధ్రనుండి కీలక నేతలుగా ఉన్నవారు అక్కడి ప్రజలకు చేసిందేమిటి?
• జగన్ రెడ్డి మూడుముక్కలాటకు వంతపాడుతున్నందుకు ధర్మాన, బొత్స, తమ్మినేని లాంటి వారు నిజంగా సిగ్గుపడాలి
• 67 కంపెనీలకు అధిపతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజాసేవకు పనికొస్తాడా అని ధర్మాన అనలేదా?
• జగన్ రెడ్డిపై సీబీఐవేసిన ఛార్జ్ షీట్లలో ఏ5 గా ఉన్న ధర్మాన ఉత్తరాంధ్రపై కపటప్రేమ చూపుతూ, ఆప్రాంత వాసుల్ని రెచ్చగొడుతున్నాడు
-నక్కా ఆనంద్ బాబు 

ఉత్తరాంధ్ర అభివృద్ధికి మూడురాజధానులు ఒక్కటే మార్గమన్నట్లుగా మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి, ఆపార్టీనేతలు,మంత్రులు ఈ మూడున్నేళ్లలో విశాఖక కేంద్రంగా ఆప్రాంత దోపిడీయే లక్ష్యంగా వ్యవహరించారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!

“మాజీసైనికోద్యుగుల భూములుసహా, బీదసాదల భూముల్నికూడా ప్రభుత్వఅసైన్డ్ ల్యాండ్స్ ని నకిలీపత్రాలతో అడ్డగోలుగా స్వాహాచేశారు. జగన్మోహన్ రెడ్డి మూడుముక్కలాట మొదలెట్టినప్పటినుంచి ఒక్కవిశాఖనగరంలోనే 40వేలకోట్లవిలువైన భూముల రిజిస్ట్రేషన్లు జరగ్గా, 72వేల ఎకరాలకు పైగాభూమి చేతులుమారింది. ఈవిధంగా చేతులుమారిన భూదందాలో విజయసాయిరెడ్డి పెద్దతలకాయగా వ్యవహరించిఉంటే, అతని బినామీలు, బంధువులు కీలక సూత్రధారులుగా ఉన్నారు. ఉత్తరాంధ్రపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ, సూక్తులు చెబుతు న్న ధర్మాన ప్రసాదరావు వైసీపీలోఉండి తన ప్రాంతానికి ఏం ఒరగబెట్టాడో చెప్పాలి. మూడున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి, ఉత్తరాంధ్రప్రాంత వైసీపీనేతలు, మంత్రులు ఆ ప్రాంతానికి, ప్రజలకు ఏంఒరగబెట్టారు? దశాబ్దాలనుంచీ ప్రజలిచ్చిన అధికారాన్ని అనుభవిం చడం తప్ప, ధర్మానగానీ, బొత్స, తమ్మినేనిసీతారామ్ లుగాను ఆప్రాంతాన్ని 1శాతమైనా అభివృద్ధిచేశారా?
జగన్మోహన్ రెడ్డిపై ఉన్న సీబీఐ ఛార్జ్ షీట్లలో ఒక దానిలో ముఖ్యమంత్రి ఒకటోముద్దాయిగా (ఏ1) ఉంటే, ధర్మానప్రసాదరావు 5వ ముద్దాయి (ఏ5) గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి సహా ముద్దాయిగా ఉన్న ధర్మాన పెద్దనీతిమంతుడిలా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. గతంలో ఇదే ధర్మానప్రసాదరావు జగన్మోహన్ రెడ్డి గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ, “67 కంపెనీలకు అధిపతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటున్నాడు. అలాంటి వ్యాపారధోరణితో ఆలోచించే వ్యక్తి ప్రజలకు సేవచేస్తాడా, తండ్రిపదవిని అడ్డంపెట్టుకొని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతున్నాడు” అన్నాడు.

మాజీ సైనికోద్యోగుల భూముల్ని దిగమింగిన ధర్మాన వాటిని కాపాడుకోవడానికే విశాఖ రాజధాని అంటున్నాడు. గతంలోకాంగ్రెస్ లో ఉన్న ధర్మాన జగన్మోహన్ రెడ్డిని తిట్టరాని తిట్లు తిట్టిన ధర్మాన, తరువాత తనపదవులకోసం జగన్ పంచనచేరాడు. 2019 ఎన్నికలకు ముందు అమరావతి ఎక్కడికీపోదని చెప్పిన ధర్మాన, ఇప్పుడేమో ప్రజలమధ్య విద్వేషాలకు ఆజ్యంపోస్తున్నాడు. ధర్మాన రెవెన్యూమంత్రిగా ఉన్నప్పుడు 77ఎకరాల మాజీసైనికోద్యోగుల భూమికి ఎన్ఓసీ ఇచ్చాడు. సదరు సైనికోద్యోగులతో మాట్లాడిన ధర్మాన, ఆయన భార్య, ఆయన తమ్ముడు కృష్ణదాస్, ఆయన కొడుకు మనోహర్ నాయుడు, వారికి చెందిన కంపెనీలతో కలిసి కాజేశారు. ఆ విధంగా సైనికోద్యోగుల భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపింది ధర్మాన అతని కుటుంబమే. ధర్మాన నేత్రత్వంలో జరిగిన భూదోపిడీని సిట్ విభాగం తప్పుపట్టిందికూడా. పలువురు ఐఏఎస్ లు, సబ్ రిజిస్ట్రార్ల పాత్రఉందని కూడా సిట్ తేల్చింది. ఆ విధంగా కొట్టేసిన భూములు నేటికీ నిరుపయోగంగా అలానే ఉన్నాయి. అలాంటి భూముల్ని తిరిగి తనపరం చేసుకోవడానికి, మరిన్ని భూముల్ని జగన్మోహన్ రెడ్డి అండతో కొట్టేయడానికే ధర్మాన తన నరంలేని నాలుకకు పనిచెప్పి, ఉత్తరాంధ్రవాసుల మనస్సుల్లో విషబీజాలు నాటుతున్నాడు.

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో తిరుగుతున్నధర్మాన, భవిష్యత్ లో తాను మరలా మంత్రిగాపనిచేయాలని, తనకొడుకుని ఎంపీని చేయాలని మూడుజిల్లాల్లోని వారితో మంతనాలు జరుపుతూ విద్వేషాలకు ఆజ్యంపోస్తున్నాడు. ధర్మానకు నిజంగా నీతినిజాయితీ ఉంటే తనపైవచ్చిన ఆరోపణలపై, తానుచేసిన భూదోపిడీపై ఎందుకు విచారణ కోరడు? విశాఖనగరవాసులు వైసీపీని ఆదరించడంలేదు. గతంలో తనతల్లిని ఆ నగరప్రజలు ఓడించారన్న కక్షతోనే జగన్మోహన్ రెడ్డి వారిపై పెత్తనంచేయడానికి విజయసా యిరెడ్డిని, వై.వీ.సుబ్బారెడ్డిని అక్కడ నియమించాడు. వారిద్దరూ వైసీపీవారితో, ఉత్తరాంధ్ర మంత్రులతో కలిసి ఎంతవరకు వీలైతే అంతవరకు దోచిపెడితే తరువాత తీరుబడిగా జగన్మో హన్ రెడ్డి వెళ్లి అక్కడ తిష్టవేస్తాడు.

విశాఖపట్నంప్రాంతం వైసీపీరాబందుల దెబ్బకు ఎలా విలవిల్లాడుతోందో అక్కడిప్రజలని అడిగితే చెబుతారు. కాంగ్రెస్ లోఉన్నప్పుడు, జగన్ పంచన చేరాక తాను కొట్టేసిన భూము ల్ని క్రమబద్ధీకరించుకొని అమ్ముకోవాలన్నదే ధర్మాన తాపత్రయం తప్ప, నిజంగా తన ప్రాం తంపై ప్రేమాభిమానాలు ఉండికాదు. ధర్మాన మాజీసైనికోద్యోగుల భూములు కాజేశాడో లేదో చెప్పాలి. ఊరికే రెచ్చగొట్టేప్రకటనలు చేయడం, సంబంధంలేకుండా ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. ఉత్తరాంధ్రప్రజలు ధర్మానప్రసాదరావుని, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారామ్ లను తమప్రాంతానికి ఏమైనా చేయమని అడిగారా?మూడు రాజధానులు కావాలనివారు మంత్రుల్ని, వైసీపీవారిని అడిగారా? వైసీపీప్రభుత్వ దోపిడీ, ధర్మాన, ఇతరమంత్రులభూకబ్జాలు ప్రజలకు తెలియకూడదనే ప్రాంతాలు, ప్రజలమధ్యన చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ధర్మాన, బొత్స, తమ్మినేని, ఆప్రాంత వైసీపీనేతలు ఉత్తరాంధ్రద్రోహులని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. ఉత్తరాంధ్రవాసులు ఎట్టిపరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని, ఆయనప్రభుత్వాన్ని నమ్మే పరిస్థి తిలో లేరు. విశాఖవాసులు 2019ఎన్నికల్లోనే తమకున్నచిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఆక్రమంలోనే అక్కడ టీడీపీవారిని గెలిపించారు” అని ఆనంద్ బాబు అభిప్రాయపడ్డారు.

LEAVE A RESPONSE