Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో తస్మదీయులు ప్రజలకి ఒక కర్ర ఇస్తే దానితో ఫ్యాన్ తిప్పుకుంటారు

– ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యుత్ కోత‌ల‌పై నాగ‌బాబు చుర‌క‌లు
– ఏపీలో విద్యుత్ కోతలకు ఫ్యాన్ తిరగటం లేదని విమ‌ర్శ‌
– ఫ్యాన్ తిరక్కపోతే తస్మదీయులకు కూడా ఇబ్బందే అని ఎద్దేవా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యుత్ కోత‌ల‌పై జ‌న‌సేన నేత నాగ‌బాబు స్పందిస్తూ ప్ర‌భుత్వ తీరును ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ‘ఏపీలో విద్యుత్ కోతలకు ఫ్యాన్ తిరగటం లేదు. తస్మదీయులు ప్రజలకి ఒక కర్ర ఇస్తే, ఆ కర్రతో ఆయినా ఫ్యాన్ తిప్పుకుంటారు. ఎందుకంటే ఫ్యాన్ తిరక్కపోతే తస్మదీయులకు కూడా ఇబ్బందే!’ అని నాగ‌బాబు చుర‌క‌లంటించారు.

కాగా, టీ టైం అవుట్ లెట్ వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జ‌న‌సేన‌తో చేరార‌ని నాగ‌బాబు చెప్పారు. ‘తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త, టీ టైం అవుట్ లెట్ వ్యవస్థాపకుడు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 17 రాష్ట్రాల్లో 3 వేల టీదుకాణాలు స్థాపించి 20 వేలమందికి పైగా ఉపాధి కల్పించారు. ఏ రాజకీయశక్తులకు తలొగ్గకుండా జనంకోసం పనిచేస్తున్న జనసేనలో చేరడం జన సైనికులకు స్ఫూర్తినిచ్చే అంశం’ అని నాగ‌బాబు పేర్కొన్నారు.

LEAVE A RESPONSE