-దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి
-నాగార్జున బాల వీరాంజనేయ స్వామికి బహిరంగ క్షమాపణ చెప్పాలి
-మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
నందిగామ టౌన్ : మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కొండేపి శాసనసభ్యులు బాల వీరాంజనేయ స్వామిపై మంత్రి నాగార్జున చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తన కార్యాలయంలో ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. యావత్ దళిత సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు మంత్రి నాగార్జున చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాము. కొండేపి ఎమ్మెల్యే బాలా వీరాంజనేయ స్వామిని మంత్రి నాగార్జున నువ్వు దళితుడికే పుట్టవా..? అని అనడం దారుణం.. తల్లులను అవమానించే విధంగా మంత్రులు,ఎమ్మెల్యేలు పుట్టుకల గురించి మాట్లాడుతూ భారతదేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని ఖూనీ చేస్తున్నారుఒకరి పుట్టుక గురించి కానీ ఒకరి చావు గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు.
దళిత సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుకు మాత్రమే పరిమితం చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ వచ్చిన నాటి నుంచి ఈ రోజుకి దళితుల మీద రాష్ట్రంలో దాడులు చేస్తూనే ఉన్నారు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కిన నాటి నుంచి నిత్యం వైసీపీ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో దళితులపై దాడులు జరుపుతూనే ఉన్నాడు. చట్టసభ అయిన అసెంబ్లీ సాక్షిగా కొండేపి శాసనసభ్యులు బాల వీరాంజనేయ స్వామి ని జగన్ రెడ్డి మెప్పుకోసం మంత్రి నాగార్జున నువ్వు దళితులకే పుట్టావా? అని అనడం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఉండటం చాలా దుర్మార్గం.
రోజు రోజుకి వైసీపీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి స్థాయి మరచి స్పృహ కోల్పోయి మాట్లాడడం సిగ్గుచేటు.వెంటనే మంత్రి మేరుగా నాగార్జున బాల వీరాంజనేయ స్వామి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీ సాక్షి గా నువ్వు దళితుడికే పుట్టావా ? అని మాట్లాడిన మేరుగ నాగార్జునను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము.