– కేంద్రం సరిపడా యూరియా ఇచ్చామంటోంది
– మధ్యలో యూరియా ఎక్కడ బోయినట్టు ?
– రోడ్ల మీదకు రైతులు ఎందుకు వస్తున్నట్టు ?
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: దేశం లో ప్రజలు అత్యంత సొంతం చేసుకున్న నినాదం జై జవాన్ -జై కిసాన్. ఆ నినాదాన్ని ఇచ్చిన పార్టీ యే రాష్ట్రం లో ఇపుడు అధికారం లో ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ నై కిసాన్ …నై యూరియా అంటోంది. యూరియా కోసం రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అష్ట కష్టాల పాలు జేస్తోంది.
యూరియా కూడా సరఫరా చేయలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రం రాష్ట్రానికి సరిపడా యూరియా ఇచ్చామంటోంది . రాష్ట్ర ప్రభుత్వం రాలేదంటోంది. మధ్యలో యూరియా ఎక్కడ బోయినట్టు? రోడ్ల మీదకు రైతులు ఎందుకు వస్తున్నట్టు?
ఓ రైతు బర్త్ డే చేసుకుంటే యూరియా బస్తా ను గిఫ్ట్ గా ఇచ్చారు .అలాంటి పరిస్థితి రాష్ట్రం లో ఉండటం దురదృష్టకరం. గతం లో ఉల్లిపాయల కొరత ఉన్నపుడు పుట్టిన రోజులకు ఉల్లి గడ్డలు కానుకగా ఇచ్చి నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయి. ఉల్లిపాయల కొరత తో ప్రభుత్వాలే పడిపోయాయి. యూరియా కొరత కు రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు పడాలి.
వరి 45 లక్షలు, పత్తి 46 లక్షలు 18 లక్షలు ,ఉద్యాన వన పంటలు మరో 9 లక్షల ఎకరాల్లో సాగు అయ్యాయి. గతం కన్నా 22 లక్షల ఎకరాల్లో వరి విస్తీర్ణం తగ్గింది. మిగతా పంటల విస్తీర్ణం కూడా తగ్గింది. కేసీఆర్ హయం లో 2022 లో కోటి 35 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండేది. రాష్ట్రానికి కేటాయించిన 10 లక్షల టన్నుల యూరియా అపుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయగలిగాము.
ఇపుడు సాగు విస్తీర్ణం తగ్గినా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? ఈ సారి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి 9 లక్షల 80 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారు. ఇందులో ఐదు లక్షల టన్నుల యూరియా మాత్రమే రైతులకు సరఫరా చేశారు. ప్రభుత్వం దగ్గర మార్క్ ఫెడ్ గోడౌన్లలో సరిపడా స్టాక్స్ లేవు.
ప్రతి రోజూ రైతులకు 15 వేల టన్నుల యూరియా సరఫరా చేయాలి. ఇపుడు 5 వేల టన్నులు కూడా యూరియా సరఫరా చేయలేకపోతున్నారు. ఏప్రిల్ లోనే రాష్ట్రాలకు కేంద్రం యూరియా కేటాయింపులు చేస్తుంది. కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లు మంత్రులు ఏం చేస్తున్నట్టు ?
సీఎం రేవంత్ యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు. యూరియా బ్లాక్ మార్కెట్ అవుతుందనే నీమ్ కోటెడ్ చేశారు. ఇపుడు బ్లాక్ మార్కెట్ కు తరలే ప్రసక్తే లేదు. ప్రభుత్వం కేవలం కుంటి సాకులు చెబుతోంది. సాఫీగా పాలన సాగుతున్న రోజులు పోయి ప్రజలను కష్టపెట్టే పాలన వచ్చింది. కేసీఆర్ హాయం లో రైతులకు సకాలం లో అన్నీ వచ్చాయి . ఇప్పుడెందుకు రావడం లేదు ?
ఇంగ్లీష్ భాష రావడం ,రాకపోవడం గురించి సీఎం ను ఎవరు అడిగారు? రాహుల్ గాంధీ యేమో ఇంగ్లీష్ అత్యవసరం అని అంటారు. రేవంత్ రెడ్డి యేమో ఇంగ్లీష్ అవసరం లేదు. కామన్ సెన్స్ ఉండాలి అంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ ల మధ్య సంబంధాలు బాగున్నపుడు యూరియా కొరత ఎందుకు వస్తోంది?
బీజేపీ ఎంపీ లు ఎపుడూ యూరియా కొరత గురించి మాట్లాడటం లేదు. మంత్రి తుమ్మల బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారు . ఇద్దరు కలిసి నిజమేమిటో చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది జాతీయ సంపద .దాన్ని వాడుకోవడం ప్రభుత్వ కనీస భాద్యత.
బనక చర్ల కోసం కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నారు. రైతు బీమా దరఖాస్తు కోసం మూడు రోజుల టైమ్ పెట్టడం లబ్దిదారుల సంఖ్య తగ్గించడానికి కాదా?
ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ ,ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి, పుట్టా మధు, బీ ఆర్ ఎస్ నాయకురాలు సుమిత్రానంద్ పాల్గొన్నారు.