కేంద్ర బడ్జెట్ అర్థం చేసుకుని దేశ మిషన్, పాలసీలకు అనుగుణంగా ఏ రాష్ట్రం కష్టపడ్డా ఆ నిధులు వాటికి దక్కుతాయి.
కేంద్ర బడ్జెట్ 2026-27 కేవలం అంకెల గారడీగా కాకుండా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక స్పష్టమైన దిశానిర్దేశంలా కనిపిస్తోంది. కేంద్రం “వికసిత భారత్” దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో, రాష్ట్రం కూడా పాలసీలు తీసుకు వచ్చి స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు పెట్టుకుని, నిత్యం సమీక్షించుకుంటూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో దూకుడుగా ఉంది.
ఈ బడ్జెట్లో అత్యంత ఆకర్షణీయమైన అంశం ₹40,000 కోట్ల కేటాయింపుతో ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ మరియు ₹10,000 కోట్లతో బయోఫార్మా, సెమీకండక్టర్ మిషన్.
మైనింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సహజ సంపదను గుర్తించి, ప్రత్యేకంగా ‘రేర్ ఎర్త్ కారిడార్’ ఏర్పాటు చేయడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరినిస్తుంది. ఇది తయారీ రంగాన్ని పరుగులు పెట్టిస్తుంది.
రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా హైదరాబాద్-బెంగళూరు మరియు హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రతిపాదన, కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, కారిడార్ వెంబడి కొత్త వాణిజ్య కేంద్రాల ఏర్పాటుకు దారితీస్తుంది.
అరకు వ్యాలీలో మార్గాల అభివృద్ధి, పులికాట్ వద్ద పక్షుల రక్షణ మరియు సాగర తీర వృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రశంసనీయం. పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి.
350కి పైగా ఆర్థిక సంస్కరణల అమలు మరియు జీఎస్టీ సరళీకరణ పారిశ్రామిక వేత్తలకు వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేస్తుంది. ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంను కొంత సులభతరం చేస్తుంది.
ఈ బడ్జెట్ ప్రతిపాదనలు కాగితంపై అద్భుతంగా ఉన్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో వేగంగా అమలు చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ నిజమైన లబ్ధిదారు కాగలదు. నాయుడి అనుభవం, లోకేశ్ వేగం మన దగ్గర ఉన్న అస్త్రాలు. కేంద్ర సహకారం, పవన్ కళ్యాణ్ ఆంధ్రాకు అదనపు బలం.
