దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక ట్రాన్స్‌మీడియా నగరంగా రాజధాని అమరావతిని తీర్చిదిద్దడం చంద్రబాబు కల.
శాన్ఫ్రాన్సిస్కోలో లోకేష్, క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సజన్ రాజ్ కురుప్, సీనియర్ పార్టనర్ ఇయాంగ్ కాపింగ్, అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ & స్క్రీన్ రైటర్ చిక్ రసెల్‌తో భేటీ. ప్రాజెక్టును త్వరగా మొదలు పెట్టండి అంటూ లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఏఐ ఆధారిత వర్చువల్ స్టూడియోలు, ఏఆర్/వీఆర్ థీమ్ పార్కులు, ప్రపంచ స్థాయి కో-ప్రొడక్షన్ సౌకర్యాలు—ఇవి అన్నీ కలిపి అమరావతిని ట్రాన్స్‌మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళిక.
₹10,000 కోట్ల పెట్టుబడులు, 1.5 లక్షల ఉద్యోగాలు, VFX, గేమింగ్, యానిమేషన్, AI, AR/VR రంగాల్లో స్థానిక యువతకు అపార అవకాశాలు. క్రియేటర్ ల్యాండ్ అకాడమీ” ద్వారా కటింగ్ ఎడ్జ్ ట్రైనింగ్ అందుతుంది.
గత ఏడాది మే 4న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నట్లుగా 24 నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభం జరుగుతుంది అని, ఆ దిశగా సన్నాహాలు మొదలెట్టాం అని క్రియేటివ్ ల్యాండ్ వారు తెలియజేశారు. ఈ ప్రాజెక్ట్ మొదలైతే, అమరావతి ఇకపై కేవలం పరిపాలనా కేంద్రం కాదు— ‘కలల రాజధాని’ నుంచి, ‘క్రియేటివ్ క్యాపిటల్’గా దేశంలోనే సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతోంది. మన యువ క్రియేటివ్ మైండ్స్ కలల గమ్యంగా అమరావతి మారనుంది.