– హౌస్ అరెస్ట్ అయిన తర్వాత మీడియా తో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
దళితుల 27 పథకాలు రద్దు చేసినందుకు విజయవాడలో ధర్నా చౌక్ లో ధర్నా కు తెలుగుదేశం పార్టీ SC సెల్ పిలుపు నిస్తే నాయకులను ఎక్కడికి అక్కడ అడ్డుకుంటున్నారు.కార్యకర్తలు ను గ్రామ స్థాయిలో పోలీసులను పెట్టి బెదిరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ని దళితులు,గిరిజనులు ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళకే శఠగోపం పెట్టాడు. స్వాతంత్ర్యము వచ్చాక అమలు అవుతున్న అనేక పధకాలను రద్దు చేసిన ప్రభుత్వం ఇది.
డా.BR. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా దళితులు,గిరిజనులు కి ఇచ్చిన హక్కులను కాలరాస్తూ వున్నాడు.మేము అధికారంలో ఉండగా అంబేడ్కర్ విదేశీ విద్య పధకం ద్వారా 700 మంది దళితుల పిల్లల్ని విదేశాలు పంపి చదివించాము.ఈ మూడు సంవత్సరాలు దానిని వదిలేసి ఇప్పుడు అంబేద్కర్ పేరు తీసి జగన్నన్న విదేశీ విద్య అని పేరు పెడుతున్నాడు. ఆ మహానుభావుడు పేరు తీసివేసిన దుర్మార్గుడు.
ఎన్టీఆర్ విద్యోన్నతి, sc కార్పొరేషన్ ద్వారా లోన్ లు అన్నిటిని తుంగలో తొక్కాడు. వాక్ స్వాతంత్ర్యము,నిరసన తెలియచేయడం మా ప్రాధమిక హక్కు లు ఆ హక్కు ల ను హరించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు. ప్రతి దానికి పోలీసులను పంపడం హౌస్ అరెస్ట్ అనడం ఇది మా హక్కుల కు భంగం కలుగచేయడమే. పోలీసులను ఈ విధంగా వాడుకుంటున్నారు. రేపు ఎలక్షన్ కూడా పోలీసుల తో నే చేయించిన విధం గా ఉన్నారు. తనని బయటకు వెళ్లనీయకుండా అదుకున్నందుకు నిరసనగా అక్కడే బైఠాయించారు.