– బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ జన్మనిచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే
– టీడీపీ లేకపోతే బడుగులకు వెలుగులేదు
– అన్న ఆశయాలు సాధిస్తాం
– తెలంగాణ అభివృద్ధి చంద్రబాబు చలవే
– తెలంగాణలో మళ్లీ టీడీపీ సత్తా చాటతాం
– కాసాని నేతృత్వంలో మళ్లీ టీడీపీ హవా
– తెలంగాణలో టీడీపీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించండి
– ఆరేడు నెలలు సైనికుల్లా పనిచే ద్దాం
– కార్యకర్తల బలమే టీడీపీ పునాది
– పనిచేసేవారికి పదవులు
– టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి
– నర్సాపూర్‌లో టీడీపీ మెదక్ పార్లమెంట్ మినీ మహానాడు
తెలంగాణలో భూస్వాములు, పెత్తందార్ల పాదాలకింద దశాబ్దాలపాటు నలిగిపోయిన బడుగు బలహీన వర్గాలకు, స్వేచ్ఛావాయులు ప్రసాదించిన ఘనత దివంగత మాజీ సీఎం ఎన్టీరామారావుకే దక్కిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. టీడీపీ లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బడుగులకు వెలుగులేదని స్పష్టం చేశారు. బీసీలే పార్టీకి వెన్నుముక అన్నారు.
నర్సాపూర్‌లో జరిగిన టీడీపీ మెదక్ పార్లమెంట్ మినీ మహానాడుకు రావుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ శతజయంతి ని పురస్కరించుకుని నర్సాపూర్ లో సాయి కృష్ణ పంక్షన్ హల్ లో మెదక్ పార్లమెంటు మినీ మహానాడు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులు గా పొలిట్ బ్యూరో మెంబర్ రావుల చంద్రశేఖర్ రెడ్డి ,కాసాని వీరేశం ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం జెండా ను ఎగురవేసి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ, తెలంగాణలో టీడీపీ నుంచి నేతలు వెళ్లిపోయినా కార్యకర్తలు ఉన్నారని, వారే పార్టీకి పునాదిరాళ్లని వ్యాఖ్యానించారు.
టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో, పార్టీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం చేసిన కృషిని కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. ఈ ఆరేడు నెలలు కార్యకర్తలకు పరీక్షా సమయమన్నారు. అప్పటివరకూ సైనికుల్లా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ ఆశయసాధనకు ప్రతి టీడీపీ కార్యకర్త పునరంకితం కావాలన్నారు. తెలంగాణలో అభివృద్ధి చంద్రబాబు నాయుడు చలవేనని, హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపిన ఘనత చంద్రబాబుదేనన్నారు. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం వచ్చేందుకు ఎంతో దూరం లేదన్నారు.
తొలుత స్థానికంగా పార్టీని బలోపేతం చేయడం ద్వారా, పార్టీ సత్తా చాటాలన్నారు. పనిచేసేవారికి పదవులిచ్చేందుకు అధ్యక్షుడు కాసాని సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకువెళ్లి, గతంలో తెలంగాణ అభివృద్ధికి టీడీపీ చేసిన కృషిని వివరించడం ద్వారా, ప్రజలకు దగ్గర కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి పార్లమెంట్ నర్సాపూర్ కోఆర్డినేటర్ వెంకటరమణ ,పార్లమెంట్ అబ్జర్వర్ ఇల్లేందుల రమేశ్ అధ్యక్షత వహించారు.
చాలాకాలం తర్వాత నర్సాపూర్‌లో జరిగిన టీడీపీ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కొన్నేళ్ల తర్వాత నర్సాపూర్ ప్రాంతంలో టీడీపీ జెండాలు రెపరెపలాడటం అందరినీ ఆకర్షించింది.
ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్నా,కాసాని సాయి ,రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు పొగాకు జైరాం, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి ,రాష్ట్ర సాంస్కృతిక అధ్యక్షులు చందహాస్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.కె గంగాధర్ రావు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్.శ్రీనివాస్ గౌడ్ , మండూరి సాంబశివరావు, డాక్టర్ ఏఎస్‌రావు , రాష్ట్ర మహిళ నాయకురాలు సూర్యదేవర లత, సాయి తులసి , పుట్టి రాజు ,జాతీయ గౌడ సంఘం అధ్యక్షులు కొయ్యాడా స్వామి గౌడ్ ,నాయకులు ,ఏ.కె రమేష్ , అప్జల్ ,మీసాల కృష్ణ ,మల్లేశం గౌడ్ ,ఒగ్గు రాజు ,సంజీవ్ ,నగేష్ ,అశోక్ గుప్తా ,బాయికాడీ నర్సింహులు , .కోండి కుమార్ ,ఆకుల రాములు ,రామస్వామి గౌడ్ ,సంతోష్ గుప్తా ,హనుమంత రెడ్డి ,సత్యం తదితరులు పాల్గొన్నారు.