Suryaa.co.in

Andhra Pradesh

అక్రమ చెరువుల కోసమే కలెక్టర్ ను పేర్ని నాని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు

– మీ దోపిడీకి సంబంధించి అన్ని ఆధారాలు మా వద్ద వున్నాయి, సర్వ్ నంబర్లతో సహా బయట పెడుతా
– పేర్ని నాని గుర్తుంచుకో ఎక్కువకాలం నీ డ్రామాలు సాగవు.
– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం : కైకలూరులో పేర్ని నాని అక్రమ చెరువుల కోసమే కలెక్టర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.నిషేదిత భూముల్లో పేర్ని యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు.అడ్డు రాకుండా కలెక్టర్ ను జడ్పీ మీటింగ్ ద్వారా బ్లాక్ మెయిల్. ఓట్లు వేసిన బందరు ప్రజలకోసం సీఎం ఇంటిముందు ఎందుకు ధర్నా చేయలేదు, జి+3 ఇళ్లకోసం ఇందుకోసం ధర్నా చేయలేదు ?

బందరులో పేర్ని కొడుకు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడం కనిపించలేదా ? కలెక్టర్ మీద మీరు పిర్యాదు చేస్తున్నారు – ప్రజలు మీమీద పిర్యాదు చేస్తన్న విషయం కనిపించడం లేదా? గడచిన నాలుగున్నారా సంవత్సరాలుగా పేర్ని నాని ఎన్నిసార్లు బందరులో పర్యటించారు, ఎన్ని సమస్యలు పరిష్కరించారు.పవన్ కళ్యాణ్ గారిని , చంద్ర బాబు గారిని, లోకేష్ని తిట్టడం తప్ప నువ్వు బందరు ప్రజలకు సాధించినది ఏంటి చెప్పాలి.

గత ప్రభుత్వంలో మేము మంజూరు చేసి మొదలు పెట్టిన పనులు ఎందుకు ఇంకా పూర్తి చేయలేదు. జిల్లా మంత్రి రోజా రెడ్డి పర్యాటక మంత్రిగా వున్నారు కనీసం బీచ్ కు కూడా అభివృద్ధి నిధులు తెచ్చు కోలేరా ? 10 కోట్ల రూపాయలు బీచ్ కు ఖర్చు చేసి, మరో 10 కోట్లు అభివృద్హికి నిధులు మంజూరు చేసాం వాటిని కూడా తెచ్చు కోలేక పోయారు.

జ్యూవెలరీ పార్కులో కల్యాణ మండపం, చిన్నాపురం మంచినీటి పైప్ లైన్ కోసం 11 కోట్లు నిధులు మంజూరు చేసామ్, మంచినీరు శుద్ధి కోసం ప్లాంట్, మునిసిపల్ ఆఫీస్, ఉల్లిపాలెం బ్రిడ్జి, మంచి నీటి ట్యాంక్, ఇలా బందరు అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే మీరు వచ్చి ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదు, వీటి కోసం ఎందుకు పోరాటం చేయలేదు, సీఎం ఇంటిముందు ఎందుకు ధర చేయలేదు అని ప్రశ్నిస్తున్న ?

అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అటుంచి బీచ్ లో వున్నా మట్టిని తరలిస్తున్నారు, మునిసిపల్ ఆఫీస్ వద్ద వున్నా మెటీరియల్ దోచుకెళుతున్నారు. సిగ్గు లేకుండా అమ్ముకుంటున్నారు. బందరులో వున్నా వనరుల్ని దోచేశారు, మట్టి, ఇసుకా, చెరువులు, అస్సైన్మెంట్ భూములు,గౌడౌన్లు, ఇలా అన్ని దోచేశారు. ఇప్పుడు కైకలూరు మీద పడ్డారు, దాని దృష్టిని మరల్చేందుకు ఈ జడ్పీ మీటింగ్ కి కలెక్టర్ రాలేదని హడావుడి చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మీ దోపిడీ కి సంబంధించి అన్ని ఆధారాలు మా వద్ద వున్నాయి, సర్వ్ నంబర్లతో సహా బయట పెడతా . పేర్ని నాని గుర్తుంచుకో ఎక్కువకాలం నీ డ్రామాలు సాగవు.

LEAVE A RESPONSE