– భువనేశ్వరి వందేళ్ల పాటు సమాజానికి సేవలందించాలన్న టీడీపీ అధ్యక్షుడు కాసాని
– భువనేశ్వరి స్ఫూర్తితో తెలుగుమహిళలు సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించాలని జ్ఞానేశ్వర్ పిలుపు
– అమ్మతనానికి భువనేశ్వరి నిదర్శనమన్న తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు షకీలారెడ్డి
– తెలంగాణ టీడీపీ కార్యాలయంలో తెలుగుమహిళ ఆధ్వర్యాన ఘనంగా భువనేశ్వరి జన్మదిన వేడుక
మానవత్వానికి మరోపేరు నారా భువనేశ్వరి అని తెలంగాణ తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి కొనియాడారు. లక్షలాదిమందికి రక్తదానం, వేలాదిమంది నిరుపేదలకు ఉచితంగా విద్య అందిస్తునే, వ్యాపారదక్షత ప్రదర్శిస్తున్న సవ్యసాచి భువనేశ్వరి అని షకీలారెడ్డి ప్రశంసించారు. నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా తెలంగాణ తెలుగుమహిళ ఆధ్వర్యాన, హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో భువనేశ్వరి జన్మదిన వేడుక నిర్వహించారు.
ఈ సందర్భంగా షకీలారెడ్డి మాట్లాడుతూ, తెలుగు ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా, ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ముందుండి ఆదుకుంటున్న టీడీపీ సేవాకార్యక్రమాల వెనుక భువనేశ్వరి
ప్రోత్సాహం ఉందని గుర్తు చేశారు. ఆపదలో ఉన్న వారికి రక్తం కావాలన్నా, క్యాన్సర్ రోగులకు సరైన వైద్య చికిత్స జరగాలన్నా, నిరుపేద కార్యకర్తలు, తలిదండ్రులను పోగొట్టుకున్న నిరుపేద పిల్లలకు ఉచిత విద్య అందించినప్పుడు భువనేశ్వరి సేవలు గుర్తుకు రాక మానదన్నారు.
లోకేష్ పాదయాత్రలో సైనికుల్లా పనిచేస్తున్న కార్యకర్తల సేవలు గుర్తించి, వారికి కృతజ్ఞతగా సన్మానం చేసి, స్వయంగా భోజనం పెట్టడం ఆమెలోని మానవతామూర్తికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.
చిన్న చిన్న సాయం చేసి అనంతమైన ప్రచారం పొందే ఈ రోజుల్లో, ఎలాంటి ప్రచారం ఆశించకుండా సామాజికసేవ చేస్తున్న భువనేశ్వరి, వందేళ్లు ఆయురారోగ్యాలతో ఈ సమాజానికి సేవలందించాలని షకీలారె డ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుమహిళ నాయకురాళ్లు కేక్ కట్ చేశారు. అనంతరం రాష్ట్ర నేతలు గ్రూప్ ఫొటోలు దిగి సందడి చేశారు.
భువనేశ్వరి సేవలను ఎంత పొగిడినా తక్కువే: కాసాని జ్ఞానేశ్వర్
అనంతరం తెలుగుమహిళలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను కలిశారు. భువనేశ్వరి జన్మదిన వేడుక నిర్వహిస్తున్న తెలుగుమహిళ రాష్ట్ర కమిటీని ఆయన అభినందించారు. ఈ
సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. తెలుగుప్రజలు ఆపదలో ఉన్న ప్రతిసారీ వారిని ఆదుకునేందుకు, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న భువనేశ్వరిని ఎంత పొగిడినా తక్కువేనన్నారు. ఒకవైపు వ్యాపారం-మరోవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే, సామాజిక సేవా కార్యక్రమాలు పర్యవేక్షించడం గొప్ప విషయమన్నారు.
పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రజాసేవలో బిజీగా ఉన్న సమయంలో వారికి అండగా నిలిచి, కార్యకర్తల కష్టసుఖాలు స్వయంగా విచారించే మానవతామూర్తి భువనేశ్వరి, వందేళ్లు వర్థిల్లాలని కాసాని ఆకాంక్షించారు. తెలుగుమహిళలు కూడా భువనేశ్వరి స్ఫూర్తితో సేవాకార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మంచి కార్యక్రమాలకు తన సహాయం, ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు.