Suryaa.co.in

Andhra Pradesh

పుంగనూరు ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనం: నారా భువనేశ్వరి

పుంగనూరులో శ్రీకాకుళం వాసులను చొక్కాలిప్పించిన ఘటన చూసి నేను షాక్ కు గురయ్యాను. ప్రజలందరినీ ఇది నివ్వెరపరిచింది. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి నిదర్శనం. 30 ఏళ్ల క్రితం బీహార్ లో కూడా ఇంత అరాచక పరిస్థితులు లేవు. పేదలపై పెత్తందారీ పోకడలు అంటే ఇవే! తెలుగుదేశం అంటే ఒక కుటుంబం. తండ్రి లాంటి తమ నేతను అక్రమంగా జైల్లో పెడితే బిడ్డలైన కార్యకర్తలు సైకిల్ యాత్ర చేసుకునే హక్కు కూడా లేదా? నడిరోడ్డుపై బూతులు తిడుతూ ఆ సామాన్యులకు మీరు చేసిన అవమానం ప్రజలంతా గమనించారు. ఎల్లకాలం నియంతల పెత్తనం సాగదు. అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే.

LEAVE A RESPONSE