– ఆమె తరఫున అమ్మవారికి సమర్పించిన టీడీపీ అధ్యక్షుడు కాసాని
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి పట్టు వస్త్రాలు పంపించారు. అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయానికి లాల్ దర్వాజా సింహమహాని మహంకాళి దేవాలయానికి , తెలంగాణ శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేతుల మీదగా పట్టు వస్త్రాలు
సమర్పించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షునితో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి వెండి బోనం సమర్పించారు. వారితో పాటు మహిళా కమిటీ సభ్యులు రాష్ట్ర పార్టీ సభ్యులు సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు పి సాయి బాబా , డాక్టర్ ఆవుల భరత్ ప్రకాష్ , ప్రకాష్ ముదిరాజు , పెద్దోజు రవీంద్ర అన్నపూర్ణమ్మ శాంతి జోగేందర్ సింగ్ విజయ్ రాతి బండ్ల రమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు
హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గం శ్రీ దర్బార్ మైసమ్మ దేవాలయ కమిటీ నిర్వాహకుల ఆహ్వాన మేరకు బోనాల పండుగ ఉత్సవంలో భాగంగా పూజ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర
అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి , మరియు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బండారు వెంకటేష్ , సీనియర్ టిడిపి నాయకులు అనూరుప్ తదితరులు పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు వారికి శాలువా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది.