నిజం గెలవాలి టీం సభ్యులు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది…
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవలు అందిస్తూ పేదవారికి అండగా ఉంటూ ముందుకు సాగుతున్న భువనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నిజం గెలవాలి టీం సభ్యులు.
భువనమ్మ చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రజలంతా చైతన్యం పొందారని నిజాన్ని గెలిపించారని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో నిజం గెలవాలి కోఆర్డినేటర్ శాసనమండలి సభ్యులు అనురాధ గారు,కో కోఆర్డినేటర్ వాలంటీర్ల ఇంచార్జ్ రవి నాయుడు, మీడియా కోఆర్డినేటర్ జస్వంత్ కాసరనేని, టీం సభ్యులు శ్రీధర్, రంజిత్, బాబి, విజయ్, పత్తిపాటి శ్రీనివాస్, ప్రణీత్, ప్రదీప్, వంశీ.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి రమణగారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి బ్రహ్మం చౌదరి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్య ప్రకాష్ గారు తదితరులు పాల్గొన్నారు.