జగనాసురుడి కళ్ళు తెరిపిద్దాం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్, నారా బ్రాహ్మణి. జగనాసుర చీకటి పాలనకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకొని నిజం గెలవాలి అంటూ నినాదాలు ఇచ్చిన నారా లోకేష్, బ్రాహ్మణి.
కనకమేడల నిరసన
నిజం గెలవాలి – కళ్లు తెరిపిద్దాం’ పేరుతో డిల్లీ లో ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్ 10 లోధి ఎస్టేట్ ఇంటి వద్ద టీడీపీ నిరసన కార్యక్రమం – కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపిన జనకమేదల రవీంద్ర కుమార్ మరియు టిడిపి శ్రేణులు -కళ్లు తెరిపిద్దాం – చంద్రబాబు గారిని సత్వరమే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.
‘‘కళ్లు తెరిపిద్దాం’’ కార్యక్రమంలో మాజీ ఎంపి కంభంపాటి రామమోహన్
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును చేయని నేరానికి, జరగని అవినీతికి తప్పుడు కేసులో ఇరికించి 52రోజులుగా అక్రమ నిర్బంధంలో ఉంచడం అనైతికం, అప్రజాస్వామికం, వ్యవస్థల దుర్వినియోగానికి పరాకాష్ట..
తనపై ఏ1 ఉందని టిడిపి నాయకులందరిపై ఏ 1 ముద్రవేయడం, తాను జైలుకెళ్లానని ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలందరినీ జైళ్లకు పంపాలనే పైశాచికానందాన్ని ఖండిస్తున్నాను..
14ఏళ్ల మాజీ సీఎంను జనంలోకి వెళ్లనీకుండా ఆయన పర్యటనలపై వరుస దాడులు, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధం ప్రజల కళ్లముందే ఉంది..జనమే జగన్మోహన రెడ్డి కళ్లు తెరిపించాలి..కక్ష కార్పణ్యాలతో, పగ ప్రతీకారాలతో మూసుకుపోయిన జగన్ కళ్లను తెరిపించే బాధ్యత జనానిదే..
‘‘కళ్లు తెరిపిద్దాం’’ కార్యక్రమంలో పాల్గొన్న అన్నివర్గాల ప్రజలకు ధన్యవాదాలు. వైసిపి నాయకుల దాడులు దౌర్జన్యాలు, హింసా విధ్వంసాలకు నష్టపోయిన బిసి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో వైసిపిని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం.. సత్యమేవ జయతే..నిజం గెలవాలి, నిజమే గెలవాలి.